- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Lunch mistakes : లంచ్ టైమ్‌లో చేసే ఈ పొరపాట్లే ఆ సమస్యలకు కారణం.. పరిష్కారమిదిగో
దిశ, ఫీచర్స్ : అధిక బరువు పెరగడంలో, తగ్గడంలో భోజనం కూడా కీ రోల్ పోషిస్తుంది. అయితే వెయిట్ తగ్గాలనే ఉద్దేశంతో కొందర కావాలని భోజన సమయంలో చాలా తక్కువగా తింటుంటారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం ఉండదు. అంటే ఇక్కడ కేవలం భోజనం మాత్రమే మీ అధిక బరువు సమస్యకు కారణం కాదంటున్నారు నిపుణులు. ఆ టైమ్‌లో చేసే కొన్ని మిస్టేక్స్ వల్లే అసలు ప్రాబ్లం ప్రారంభం అవుతుందని, వాటిని నివారించాలని చెబుతున్నారు. అవేంటో చూద్దాం.
తక్కువ తిన్నా బరువు పెరుగుతారు
వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారు తప్పక చేయాల్సిన వాటిలో మధ్యాహ్న భోజనంపై దృష్టి పెట్టాలి. అంటే తగిన పోషకాలతో బ్యాలెన్స్‌డ్‌గా ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తినే ఆహారంలో ఫైబర్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ కచ్చితంగా చేర్చుకోవాలి. అయితే కొందరు కార్బ్స్ ఎక్కువగా తింటూ.. ఫైబర్ ఫుడ్ తక్కువగా తింటుంటారు. అయినప్పటికీ బరువు తగ్గదు. పైగా పెరిగే చాన్స్ ఉంటుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి తగ్గాలనుకునేవారు ఫైబర్, ప్రోటీన్ వంటివి పోషకాలు భోజనంలో తప్పక ఉండేలా చూసుకోవాలి. అంతేకాకుండా బయటి ఫుడ్స్ నివారించాలి. ఎందుకంటే వీటిలో రుచి కోసం పలు రసాయనాలు కలుపుతారు. అధిక చక్కెరస్థాయిలు, అధిక కొవ్వులు కలిగి ఉంటాయి. అధిక బరువును పెంచుతాయి.
భోజనం మానేస్తే ఏం జరుగుతుంది.?
కొందరు బరువు పెరుగుతున్నామని మధ్యాహ్నం పూట భోజనం మానేస్తుంటారు. స్నాక్స్ లేదా ఇతర ఆహారాలు తింటుంటారు. ఇదే మీ ఆరోగ్యాన్ని పాడు చేసే అతిపెద్ద మిస్టేక్స్ అంటున్నారు నిపుణులు. లంచ్ మానేసే బదులు న్యూట్రిషనల్ ఫుడ్స్‌ని తీసుకుంటే బరువు తగ్గుతారని చెబుతున్నారు. అంతే గానీ లంచ్, డిన్నర్.. ఇలా ఏది మానేసినా దాని ప్రభావం మెటబాలిజంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
వీటికి దూరంగా ఉంటేనే బెటర్ !
బేకరీ ఫుడ్స్, స్నాక్స్, సలాడ్స్, సాసెజ్‌లు, స్వీట్లు, చిప్స్ వంటివి లంచ్ టైమ్‌లో తీసుకుంటే శరీరంలో కెలరీలు అధికమైపోతాయి. బరువు తగ్గకపోగా మరింత పెరుగుతారు. ఇది ఇతర అనారోగ్యాలకు దారితీస్తుంది. కాబట్టి మానేయడం బెటర్. ఇంకొందరు ఆకలి వేస్తున్నప్పటికీ, తాము బరువు తగ్గాలనే ఉద్దేశంతో తిండి మానేస్తుంటారు. ఇది అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. అది భోజనం చేసే సమయం అయినా, కాకపోయినా ఆకలి వేసినప్పుడు లిమిటెడ్‌గా ఆహారం తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.