Lemon: నిమ్మకాయలతో ఈ పని చేస్తే చాలు.. మీకు పట్టిన దరిద్రం పారిపోతుంది!

by Prasanna |   ( Updated:2023-03-08 09:59:48.0  )
Lemon: నిమ్మకాయలతో ఈ పని చేస్తే చాలు.. మీకు పట్టిన దరిద్రం పారిపోతుంది!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతి యొక్కరు సంతోషకరమైన జీవితాన్ని కోరుకుంటారు. అలాగే కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలని, ఎలాంటి కష్టాలు రాకూడదని కోరుకుంటారు. కానీ మనిషి సంతోషంగా ఉండాలంటే డబ్బులు కూడా ముఖ్యం. ఎందుకంటే మన అవసరాలకు డబ్బు కావాలి. ఏ మనిషి అయిన పూర్తిగా అదృష్టాన్ని పొందలేడు. ఒక్కోసారి డబ్బును కూడా కోల్పోయే ప్రమాదం వస్తుంది. వాస్తు శాస్త్రంలోని కొన్ని నిమ్మకాయ నియమాలను పాటించడం వలన మీరు చేసే ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. అవేంటో ఇక్కడ చూద్దాం.

వ్యాపార వృద్ధి కోసం ఇలా చేయండి

మీరు కష్టపడి పని చేసినా వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా ? అయితే శనివారం రోజు నిమ్మకాయను నాలుగు ముక్కలుగా కట్ చేసి..ఆఫీస్లో నాలుగు వైపులా ఒక్కొక్క ముక్కను వేయండి. ఇలా చేయడం వలన నెగిటివ్ ఎనర్జీ పోయి వ్యాపారంలో లాభాలు వస్తాయి.

చెడు దృష్టి పోవాలంటే ఈ విధంగా చేయండి

ఈ మధ్య కాలంలో ఒకరు బాగు పడుతున్నారంటే జనాలు కిందకు లాగాలని చూస్తుంటారు. అలాంటి చెడు దృష్టి మీ మీద ఉన్నట్లయితే..మీరు ఈ పనిని ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఒక నిమ్మకాయను తీసుకొని తల నుంచి కాలి పాదం వరకు ఏడు సార్లు బాగా రుద్దాలి. అలాగే నిమ్మకాయను మూడు సార్లు తిప్పి వెనక్కి విసిరేయండి. ఇలా చేసిన వెంటనే మీరు ఆ ప్రదేశం నుంచి కొంచం దూరంగా వెళ్ళాలి.

ఇవి కూడా చదవండి : Throat: గొంతులో గరగర వేధిస్తోందా? .. ఈ చిట్కాలు పాటిస్తే సరి!

Advertisement

Next Story