ఈ సారి జోక్‌ను ఎడమ చెవి ద్వారా వినండి.. మెడిసిన్‌లా పని చేస్తుందట.. లేదంటే..

by Anjali |   ( Updated:2023-08-11 06:22:34.0  )
ఈ సారి జోక్‌ను ఎడమ చెవి ద్వారా వినండి.. మెడిసిన్‌లా పని చేస్తుందట.. లేదంటే..
X

దిశ, ఫీచర్స్: మనుషులు శబ్దాలను గ్రహించినప్పుడు భావోద్వేగాలను ప్రేరేపించగలవు. అయితే ఏ చెవితో శబ్దాలు వింటామో.. అది మన ఆరోగ్యం, ఆనందంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని చెప్తోంది తాజా అధ్యయనం. ఎడమవైపు నుంచి వచ్చే శబ్దాలు స్ట్రాంగ్ ఎమోషన్స్‌ను రేజ్ చేస్తాయని గుర్తించిన స్విట్జర్లాండ్‌లోని న్యూరో సైంటిస్టులు.. వెనుక నుంచి వచ్చే సౌండ్స్ ప్రతికూల భావోద్వేగాలను ప్రేరేపిస్తాయని తెలిపారు. నవ్వు వంటి సానుకూల మానవ శబ్దాలు ఎడమ వైపు నుంచి వచ్చినప్పుడు బలమైన ప్రభావాన్ని చూపుతాయని వివరించారు.

పాజిటివ్ ఎమోషన్స్‌తో కూడిన ఎక్స్‌పీరియన్స్‌ను అందించే హ్యూమన్ వాయిస్.. వినేవారి ఎడమ వైపు నుంచి వచ్చినప్పుడు బ్రెయిన్‌ ఆడిటరీ కార్టెక్స్‌లో స్ట్రాంగ్ యాక్టివిటీని చూపుతాయని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. విన్న సమాచారాన్ని స్వీకరించే మెదడులోని ఈ తొలి ప్రాంతం.. ఈ సౌండ్‌ను ఎమోషనల్ వాల్యూగా ప్రాసెస్ చేస్తుంది. అయితే ముందు లేదా కుడి వైపు నుంచి విన్నప్పుడు ఈ ప్రతిస్పందన జరగదని చెప్తున్నారు. ఇక భయపెట్టే అరుపులు వంటి ప్రతికూల భావోద్వేగ విలువలతో కూడిన శబ్దాలు ఎడమ వైపుతో ఈ అనుబంధాన్ని చూపవన్నారు.

13 మంది వాలంటీర్లపై మెదడు ఇమేజింగ్ స్కాన్‌లను నిర్వహించిన శాస్త్రవేత్తలు ఈ ఫలితాలను కనుగొన్నారు. ప్రైమరీ ఆడిటరీ ఏరియాస్ అయిన A1, R వంటి ఎర్లీ సౌండ్ ప్రాసెసింగ్‌లో పాల్గొన్న మెదడులోని ప్రాంతాలు ఎడమ వైపు నుంచి సానుకూల స్వరాలు వచ్చినప్పుడు స్ట్రాంగ్ యాక్టివిటీని కలిగి ఉన్నాయని గమనించారు. అదే శబ్దాలు ముందు లేదా కుడి నుంచి వచ్చినప్పుడు.. నెగెటివ్ వాయిస్, నాన్-వోకల్ సౌండ్ విన్నప్పుడు ప్రతిస్పందనలు తగ్గుతాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే ముందువైపుతో పోలిస్తే ఎడమ లేదా కుడి వైపు నుంచి సానుకూల స్వరాలు వచ్చినప్పుడు కుడి అర్ధగోళంలోని L3 ప్రాంతంలో ప్రతిస్పందన కూడా పెరిగింది.

Read More: ఆ సమయంలో ఎంజాయ్ చేయలేకపోతున్నారా?.. మీ ఆలోచన మార్చుకోండి !

Advertisement

Next Story

Most Viewed