- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
దిశ ఎఫెక్ట్.. నీటి ఎద్దడి కథనానికి స్పందన

దిశ, యాచారం : మండుతున్న ఎండలతో గ్రామ పంచాయతీ బోరు బావులు ఎండిపోగా మిషన్ భగీరథ త్రాగునీరు నామమాత్రంగా సరఫరా అవుతుండడంతో తాటిపర్తి, గ్రామస్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని మంగళవారం దిశ, దినపత్రికలో నీటి ఎద్దడి కథనం ప్రచురితమైంది. దీంతో మిషన్ భగీరథ అధికారులు డిప్యూటీ ఈ ఈ రాజు, ఏఈ సుభాష్, ఏఈ కార్తీక్, ఎంపీడీవో నరేందర్ రెడ్డి, ఆధ్వర్యంలో తాటిపర్తి, గ్రామాన్ని సందర్శించారు. మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్, ఒట్టి పోతున్న బోరుబావులను పరిశీలించారు. 3, 5, వార్డులలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులతో సమావేశమై మాట్లాడారు.
ఎస్.డీ.ఎఫ్ స్పెషల్ ఫండ్ కింద 2 లక్షల 50 వేల నిధులను కేటాయించి బోరు మోటర్లకు మరమ్మత్తులు, కొత్త పైపులను కొనుగోలు చేసి బిగిస్తామన్నారు. గ్రామంలోని రైతు జగన్మోహన్ రెడ్డికి చెందిన బోరు మోటార్ తో రాత్రి వేళల్లో నీటి సరఫరా చేస్తామని అందుకోసం 20 వేలను రైతుకు ఇవ్వనున్నట్టు తెలిపారు. తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కొత్త చెరువు కింద ఉన్న బావి నుండి వాటర్ ట్యాంక్ వరకు 3 కిలోమీటర్లు ఉందని పైపులైనుకు 10 లక్షలు కుర్మిద్ద, నుండి తాటిపర్తి వరకు మిషన్ భగీరథ పైపులైను వేయడానికి 40 లక్షల వరకు నిధులు ఖర్చు అవుతాయని వివరించారు. మంచినీటికి శాశ్వత పరిష్కార మార్గాలుగా నిలుస్తాయని నివేదిక తయారుచేసి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ శివకుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు.