అంతరిక్షంలో లాఫింగ్ గ్యాస్.. గ్రహాంతర జీవుల ఉనికికి సంకేతం!

by sudharani |
అంతరిక్షంలో లాఫింగ్ గ్యాస్.. గ్రహాంతర జీవుల ఉనికికి సంకేతం!
X

దిశ, ఫీచర్స్ : భూమి వెలుపల జీవం ఉందని సూచించే అనేక సిద్ధాంతాలు చెలామణిలో ఉన్నాయి. అలాగే గ్రహాంతర జీవుల ఉనికి గురించి మనకు చాలా కాలంగా తెలియకుండా ఎలా ఉందనే చర్చ కూడా ఉంది. ఏదేమైనా అంతరిక్షంలో గ్రహాంతరవాసుల ఆలోచన అనేది ఇప్పటికీ పరిష్కరించబడని మిస్టరీలా కనిపిస్తోంది. అయితే ఈ కల్పనకు తోడు శాస్త్రవేత్తలు సైతం ఏలియన్లకు సంబంధించి కొన్ని రకాల ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. ఈ మేరకు సుదూర గ్రహ వాతావరణంలో 'లాఫింగ్ గ్యాస్' సంకేతాలు గ్రహాంతరవాసుల ఉనికిని సూచిస్తున్నాయని ఆస్ట్రోబయాలజిస్టుల బృందం పేర్కొంది.

లాఫింగ్ గ్యాస్‌గా పిలువబడే 'నైట్రస్ ఆక్సైడ్' మొక్కల ద్వారా విడుదలవుతుంది. ఈ గ్రీన్‌హౌస్ వాయువు జీవరాశి ద్వారా ఉత్పత్తి చేయబడిన వాతావరణంలో బయోసిగ్నేచర్ లేదా సమ్మేళనంగా మారుతుంది. ఇక బయోసిగ్నేచర్ భూ వాతావరణంలో సమృద్ధిగా కనిపించే వాయువులను కలిగి ఉంటుంది. కాగా నైట్రస్ ఆక్సైడ్ ఉనికిని బట్టి భూమిపై కాకుండా ఇతర గ్రహాలపైనా జీవం ఉందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా రివర్‌సైడ్(UCR) సైంటిస్టులు అభిప్రాయపడ్డారు. 'బయోసిగ్నేచర్‌లుగా ఆక్సిజన్, మీథేన్‌ల గురించి చాలా ఆలోచనలు జరిగాయి. తక్కువ మంది పరిశోధకులు నైట్రస్ ఆక్సైడ్‌ను తీవ్రంగా పరిగణించారు. కానీ అది పొరపాటు కావచ్చునని మేము భావిస్తున్నాం' అని ఆస్ట్రోబయాలజిస్ట్ ఎడ్డీ ష్విటర్‌మాన్ వివరించారు.

నైట్రస్ ఆక్సైడ్ జీవులతో కూడి ఉంటుంది

నైట్రస్ ఆక్సైడ్ సాధారణంగా పెయిన్ నుంచి రిలీఫ్‌ కోసం ఉపయోగించబడుతుంది. సాధారణంగా వీటిని దంతవైద్యులు ఉపయోగిస్తారు. దీనిని 'విప్పెట్స్' అని కూడా పిలుస్తారు. ఎందుకంటే దానిలోని చిన్న డబ్బాలు పార్టీ డ్రగ్‌గా దుర్వినియోగం చేయబడతాయి. ఈ వాయువుకు సంబంధించిన అతిపెద్ద నాణ్యత ఏమిటంటే ఇది జీవులచే రూపొందించబడింది. 'జీవం కొన్ని సూక్ష్మజీవులచే నైట్రేట్స్‌గా మార్చబడే నైట్రోజన్ వ్యర్థ ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తుంది. చేపల తొట్టిలో ఈ నైట్రేట్స్ పేరుకుపోతాయి. అందుకే అందులోని నీటిని ఎప్పటికప్పుడు మార్చవలసి ఉంటుంది' అని ష్వీటర్‌మాన్ వివరించారు.

Advertisement

Next Story