- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వావ్.. టైటానిక్ షిప్ తరహాలో ఇంటి నిర్మాణం (ఫొటో)
దిశ, డైనమిక్ బ్యూరో: కొన్ని సినిమాలు ప్రజలను బాగానే ప్రభావితం చేస్తుంటాయి. సమాజంలో జరిగే కొన్ని సన్నివేశాలు చూస్తే అది నిజమనే అనిపిస్తుంది. మరి, ఈ వ్యక్తి టైటానిక్ సినిమా చూసి ప్రభావితం అయ్యాడేమో.. ఏకంగా టైటానిక్ షిప్ తరహాలోనే ఇంటిని నిర్మించుకున్నాడు. కోల్‌కతాలోని నార్త్ 24 పరగణాల జిల్లాలోని హెలెంచకు చెందిన మింటూ రాయ్ అనే రైతు తన ఇంటిని టైటానిక్ షిప్ మాదిరి నిర్మించాడు. 20 ఏళ్లుగా వ్యవసాయంపై ఆధారపడి బ్రతుకున్న తాను.. తన సొంతింటి కలను నెరవేర్చుకోవాలనకున్నాడు. అయితే తనకి సహాయం చేసేందుకు ఏ ఇంజినీర్ సిద్ధంగా లేకపోవడంతో.. మింటూనే స్వయంగా తన ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాడు.
ఇవి కూడా చదవండి: వేరే లెవెల్.. కనీవినీ ఎరుగని రేంజ్‌లో అంబానీ భార్య బర్త్ డే వేడుకలు!
దానికోసం నేపాల్ వెళ్లి తాపీ మేస్త్రీగా మూడేళ్లు పనిచేసి పని నేర్చుకున్నాడు. అనంతరం ఓడ మాదిరి తన సొంతింటి కలను 2010లో నిర్మించడం ప్రారంభించాడు. ఈ నౌక 39 అడుగుల పొడవు, 13 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ ఇంటికోసం రూ. 15 లక్షలు ఖర్చు చేయగా...వచ్చే ఏడాదిలోగా ఇంటి నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించాడు. 9.5 డెసిమల్ స్థలంలోనే ఓడలా ఇంటిని నిర్మించడంతో చుట్టుపక్కల ప్రజలకు ఆకర్షణీయ కేంద్రంగా మారింది.