జపాన్ 'పెటాబైట్' రికార్డ్.. ప్రస్తుత ఇంటర్నెట్ వేగానికి లక్ష రెట్లు అధికం!

by Sathputhe Rajesh |
జపాన్ పెటాబైట్ రికార్డ్.. ప్రస్తుత ఇంటర్నెట్ వేగానికి లక్ష రెట్లు అధికం!
X

దిశ, ఫీచర్స్ : టెక్నాలజీ వినియోగిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండగా, అందుకు అనుగుణంగా ఇంటర్నెట్ వేగం కూడా పెరుగుతోంది. ఈ క్రమంలోనే జపాన్ మనల్ని మరింత వేగవంతమైన ఇంటర్నెట్‌కు చేరువ చేస్తోంది. ఈ మేరకు జపనీస్ పరిశోధకులు ఇంటర్నెట్‌ను ప్రస్తుత వేగం కంటే లక్ష రెట్లు వేగవంతం చేయడానికి దగ్గరగా ఉన్నారు.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (NICT)లోని నెట్‌వర్క్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు మల్టీ-కోర్ ఫైబర్ (MCF)లో సెకనుకు 1.02 పెటాబైట్ వేగాన్ని ప్రదర్శించినట్లు తాజాగా పేర్కొన్నారు. డేటా ట్రాన్స్‌మిషన్ వేగంలో ఇదో సరికొత్త రికార్డు కాగా ప్రస్తుతమున్న ఇంటర్నెట్ వేగానికి 100,000 రెట్లు వేగవంతమైన ఇంటర్నెట్‌ను ప్రపంచానికి అందించేందుకు ప్రయత్నిస్తున్నారు జపాన్ పరిశోధకులు.

పెటాబైట్ వేగం?

పెటాబైట్ (PB) డేటా యూనిట్.. 10,00,000 గిగాబైట్స్ (GB)కు సమానం. సెకన్‌కు 1 పెటాబైట్ ఇంటర్నెట్ వేగంతో.. సెకన్‌కు 8K ప్రసారానికి సంబంధించిన 10 మిలియన్ చానెల్స్‌ను రన్ చేయవచ్చు. ప్రస్తుతం లైవ్ వీడియో ప్రసారాలకు అంతరాయంగా ఉండే లాగ్స్, స్నాగ్స్ తొలగించవచ్చు. 1.02 PB ప్రతి సెకనుకు 51.499 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుంది. అంతేకాదు ప్రతి సెకనుకు 127,500 GB డేటాను పంపవచ్చు. అయితే PB వేగంతో డేటాను ప్రసారం చేసేందుకు ప్రామాణిక ఆప్టిక్ ఫైబర్ కేబుల్ అవసరం అవుతుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

పెటాబైట్ ఇంటర్నెట్ సామర్ధ్యం హోమ్ రూటర్‌లకు వచ్చే అవకాశం లేదు కానీ సమీప భవిష్యత్తులో 10 Gbps వేగాన్ని మాత్రం మనం చూస్తాం. ఈ మేరకు ఒక ఇన్నోవేషన్ ల్యాబ్ ఈ దశాబ్దం ముగిసేలోపు 10 Gbps ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుందని 2022 ఫిబ్రవరిలో ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. నిజానికి కామ్‌కాస్ట్( Comcast) టెస్టింగ్ సమయంలో గరిష్టంగా 10 Gbps వేగాన్ని సాధించినట్లు కేబుల్‌ల్యాబ్స్ ఫిబ్రవరిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.


👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story