- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జాతకంలో కాల సర్ప దోషమా.. ఇదొక్కటే మార్గం.. ఇలా చేయండి
దిశ, ఫీచర్స్: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో గ్రహాలు తారుమారు అయినప్పుడు ఈ కాల సర్ప యోగం ఏర్పడుతుంది. ఇది చాలా ప్రతికూలంగా పరిగణించబడుతుంది. జాతకంలో కాలసర్ప దోషం ఉన్నప్పుడు మనిషి జీవితంలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి. అలాంటి వ్యక్తి నిత్యం జీవితంతో పోరాటం చేస్తూనే ఉండాలి. రాహువు, కేతువులను హిందూమతంలో అశుభ గ్రహాలుగా పరిగణిస్తారు.ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి విరోధంగా ఉంటాయి. రాహువు, కేతువుల మధ్యలోకి గ్రహాలు వచ్చినప్పుడు ఈ యోగం కలుగుతుంది. జాతకంలో ఈ యోగాన్ని కాలసర్ప దోషం అంటారు.
కాలసర్ప దోషం యొక్క లక్షణాలు.. దాని ప్రభావాలను తెలుసుకోండి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఎవరి జాతకంలో అయితే ఈ కాలసర్ప దోషం ఉంటుందో వారికి కష్టాలు తప్ప సుఖాలు ఉండవు. అలాంటి వారి జీవితంలో చాలా బాధలు పడాల్సి ఉంటుంది. ఈ దోషం మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. ఒక వ్యాధి తగ్గగానే మరొక వ్యాధి తయారవుతుంది. అంతే కాకుండా, ఉద్యోగ, వ్యాపార రంగాలలో కలిసి రాదు. ఈ వ్యక్తుల వైవాహిక జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. పిల్లలు జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంటారు.
కాలసర్ప దోష పరిహారాలు..
కాలసర్ప దోషం యొక్క ప్రభావాలను తగ్గించడానికి జ్యోతిషశాస్త్రంలో అనేక నివారణలు ఉన్నాయి. కాల సర్ప దోషం ఉన్నవారు నెమలి ఈకలను ఇంట్లో, తమతో ఎప్పుడూ ఉంచుకోవాలి. వెండి పామును ప్రవహించే నదిలో పడేయాలి. హనుమంతుడిని పూజించడం వల్ల కాలసర్ప దోషం తగ్గుతుంది. హనుమాన్ చాలీసాను రోజుకు 11 సార్లు చదవాలి. కాల శరపదోషం పోగొట్టుకోవడానికి శివుడిని ఆరాధించడం చాలా ఉపయోగపడుతుంది. కనుక శివుని పూజించండి. ప్రతిరోజూ గుడి లేదా ఇంట్లో శివలింగానికి పాలు సమర్పించి అభిషేకం చేయండి.
గమనిక: పైన రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. దీనిని 'దిశ' ధృవీకరించట్లేదు