- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గర్భిణీలు థియేటర్లలో సినిమా చూస్తే ప్రమాదమా..? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..!
దిశ, వెబ్‌డెస్క్: గర్భిణీలు నార్మల్ మహిళల కంటే కొంచెం డిఫరెంట్‌గా ప్రవర్తిస్తుంటారు. కొంత మంది అసలు తినేందుకు కానీ, బయటకు వెళ్లేందుకు కానీ ఇష్టపడరు. మరికొందరు మాత్రం ఎక్కువ తినేందుకు, తిరిగేందుకు ఇష్ట పడతారు. ఈ క్రమంలోనే సినిమాలకు, షికార్లకు తిరిగేస్తుంటారు. అయితే ప్రెగ్నెన్సీ మహిళలు సినిమాలకు చూడొచ్చా లేదా..? చూస్తే ప్రమాదమా..? అని చాలా మందికి సందేహాలు ఉంటాయి. అయితే దీనిపై డాక్టర్లు ఏం చెప్తున్నారంటే..
పెగ్నెన్సీ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ టైంలో వారి హార్మోన్లలో చాలా తేడాలు వస్తుంటాయి. కాబట్టి వాళ్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అయితే చాలా మంది గర్భిణీలు థియేటర్లలో సినిమాలు చూడొచ్చా..? చూడకూడదా..? అనే అనుమానంతో సతమతమవుతుంటారు. అలా చూడటం వల్ల కడుపులో బిడ్డకు ఏమైనా ప్రమాదం వాటిల్లుతుందా అని భయపడుతుంటారు. అయితే.. నిజానికి థియోటర్లో సినిమా చూడటం వల్ల గర్భిణీలకు ప్రమాదమని.. పిండంపై ప్రభావం పడుతుందని ఇప్పటివరకు ఎలాంటి శాస్త్రీయ అధ్యయనాలు వెల్లడించలేదు.
కానీ.. గర్భిణీలు చీకట్లో సినిమా చూడటం కారణంగా కళ్లకు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే గర్భంతో ఉన్న మహిళ శరీరంలో హార్మోన్లు క్రమ పద్ధతిలో ఉండవు. దీనివల్ల కంటి నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ కారణం వల్ల థియేటర్లో సినిమాలు చూడకపోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. అదే సమయంలో థియేటర్లో వినిపించే పెద్దపెద్ద శబ్దాలతో గర్భిణీకి రక్తపోటు పెరిగే అవకాశం ఉందని అందుకే, పెద్ద శబ్దాలు వినడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే మనసు ప్రశాంతంగా ఉండేందుకు మంచి సాంగ్స్ వినడం.. స్టోరీస్ చూడటం.. మంచి మంచి పుస్తకాలు చదవడం మంచిదని నిపుణుల అభిప్రాయపడుతున్నారు.
Read more:
బ్యూటీ స్పాట్.. సొట్ట బుగ్గల వెనుకున్న రహస్యం తెలిస్తే షాక్ అవుతారు..?