Irani chai : హైదరాబాద్‌లో బిర్యానీ రేటుకు చేరిన చాయ్ ధర!

by Bhoopathi Nagaiah |   ( Updated:2024-08-13 08:01:56.0  )
Irani chai : హైదరాబాద్‌లో బిర్యానీ రేటుకు చేరిన చాయ్ ధర!
X

దిశ, వెబ్‌డెస్క్: బిర్యానీ అన్నా.. ఇరానీ చాయ్ అన్నా ఠక్కున గుర్తొచ్చేది హైదరాబాద్‌నే. ఈ రెండింటికి ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే అనూహ్యంగా ఇటీవల హైదరాబాదీ చాయ్ రేటు అమాంతం పెరిగిపోయింది. గతంలో రూ.5లకే లభించిన టీ.. ప్రస్తుతం ఐదింతలకు ఎగబాకింది. ఓ నలుగురు కలిసి ఇరానీ చాయ్ తాగితే.. ఓ సింగిల్ బిర్యానీ బిల్లు అవుతుందన మాట. దీంతో దోస్తుల జేబులు ఖాళీ అవుతున్నాయి.

ఉదయం బెడ్‌ నుంచి లేచినప్పటి నుంచి రాత్రి వరకు చాయ్‌తో నాలుకను తడపకపోతే నిద్రపట్టదు. అంతలా చాయ్ రుచికి అలవాటుపడ్డారు తెలంగాణ ప్రజలు. ముఖ్యంగా హైదరాబాద్‌లో లభించే ఇరానీ చాయ్‌కి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. దీంతో హైదరాబాదీలు రోజుకు ఒక్కసారైనా ఇరానీ చాయ్‌‌ని గుటకలు వేయకుండా ఉండలేరు. అలాంటి వారికి హోటల్ యజమానులు చేదు వార్తను అందించారు. పెరిగిన ధరల నేపథ్యంలో ఇరానీ చాయ్ ధరను 25 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో టీ ప్రియులు లబోదిబోమంటున్నారు.

ఇప్పటి వరకు ఇరానీ చాయ్ రూ.15 నుంచి 20 రూపాయల వరకు ఉన్నది. అయితే గత మూడు రోజులుగా దీని ధరను 25 రూపాయలు చేశారు. ఇటీవల లెబర్ చార్జీలు పెరగడంతోపాటు టీపొడి, చక్కెర, చాయ్ పౌడర్ ధరలు పెరిగాయని ఈ కారణంగానే గిట్టుబాటు కాకపోవడంతో ధరలు పెంచామని హోటల్ నిర్వహకులు పేర్కొంటున్నారు. కస్టమర్లు తమ సమస్యలను అర్థం చేసుకుని సహకరించాలని కోరుతున్నారు. మరోవైపు నాలుగు చాయ్‌లకు రూ.100 బిల్లు అవుతుండటంతో ఇరానీ చాయ్ ప్రియులు ఆందోళన చెందుతున్నారు.

Read More..

Heart attack: గుండెపోటు ఒకసారి వచ్చి తగ్గాక.. మళ్లీ మళ్లీ వస్తుందా?.. ఒక వ్యక్తి ఎన్నిసార్లు తట్టుకోగలడు?

Advertisement

Next Story

Most Viewed