- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Kite Festival రంగులది రంగూ.. కైటూ పతంగూ.!

సంక్రాంతికి..
ముక్క తెగుడే కాదు..
పక్కోడి పతంగి కూడా తెగుతుంది.!
కీంచ్ మామా కీంచ్ అని పోటీలుపడి ఆడుతుంటే..
ఆ మజాయే వేరు.
ఇంకెందుకాలస్యం..
రండీ.. ఇంటర్నేషనల్ కైట్‌ఫెస్టివల్‌కు హైదరాబాద్ వేదికైంది.!
సంక్రాంతికి ఊరెళ్లేటప్పుడు పంతంగి టోల్ ప్లాజా ఎంత రష్ ఉంటుందో.. పతంగులతో పల్లెటూరి మిద్దెలుకూడా అంతే రష్‌గా ఉంటాయి. ముచ్చట అట్లుంటది కాబట్టే గవర్నమెంటు కైట్ ఫెస్టివల్‌ను కండక్ట్ చేస్తోంది. చలో.. భోగి.. సంక్రాంతి.. కనుమతో పాటూ ఈ మూడ్రోజులు పతంగులతో పండగ చేస్కుందాం.!
కైట్ ఫెస్టివల్
సంక్రాంతి పండుగ నేపథ్యంలో నేటి నుంచి 7వ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. పర్యాటక, భాషా సాంసృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ కైట్‌ఫెస్టివల్ నడుస్తోంది. అంతర్జాతీయ, అంతర్రాష్టాల్లో పతంగులు ఎగురవేసే కైట్ ఫ్లయర్స్ ఈ పతంగుల పండకు వస్తున్నారు. దీనికి పరేడ్‌గ్రౌండ్స్ వేదికైంది.!
50 దేశాలు
కైట్ ఫెస్టివల్ ద్వారా తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా చేయాలనేది నిర్వహకుల లక్ష్యం. ఈ కైట్ ఫెస్టివల్‌లో 50 దేశాల అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్ పాల్గొంటారు. అలా మొత్త 120 మంది ప్లేయర్స్ వస్తున్నారు. ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ర్టేలియా, శ్రీలంక, కెనడా, కంబోడియా, స్కాట్లాండ్, థాయిలాండ్, కొరియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా, ఇటలీ, తైవాన్, సౌత్ ఆఫ్రికా, నెదర్లాండ్స్ వంటి 50 దేశాల ఆటగాళ్లు ఈ పతంగులను ఎగరేస్తారు.
14 రాష్ట్రాలు
అంతర్జాతీయ ఆటగాళ్లతో పాటు దేశవాళీ పతంగుల ఆటగాళ్లకు పరేడ్‌గ్రౌండ్ వేదికవుతోంది. మొత్తం 14 రాష్ట్రాల నుంచి 60 దేశవాళీ కైట్ క్లబ్ సభ్యులు ఈ వేడుకలో పాల్గొంటున్నారు. గుజరాత్, పంజాబ్, తమిళనాడు, కేరళ, హరియాణా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలకు చెందిన కైట్ ప్లేయర్స్ ఈ పండుగలో భాగస్వాములవుతున్నారు.
15 లక్షల మంది
ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్‌ను తిలకించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి 15 లక్షల మంది వరకు సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నారు. వీరి కోసం షామియానా టెంట్లు, తాగునీటి ఏర్పాట్లు చేశారు నిర్వహకులు. ఈ మూడ్రోజుల పాటు ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల ఈ పతంగుల ప్రదర్శన ఉంటుంది.
స్వీట్ ఫెస్టివల్
కైట్ ఫెస్టివల్‌తో పాటు స్వీట్ల పండుగను కూడా నిర్వహిస్తున్నారు. తెలుగు ప్రజలు ఇండ్లల్లో చేసే పిండి వంటలతో పాటు ఇతర రాష్ట్రాల సంప్రదాయ వంటలు, స్వీట్లను ఇక్కడ పరిచయం చేస్తారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల గొప్పదనం చాటి చెప్పేందుకే కైట్ ఫెస్టివల్.. స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని అధికారులు చెప్తున్నారు.
1100 స్వీట్లు
కైట్ ఫెస్టివల్‌తో పాటు నిర్వహించే స్వీట్ ఫెస్టివల్‌లో 1100 జాతీయ, అంతర్జాతీయ స్వీట్లు, పిండి వంటలను స్టాల్స్‌లో అందుబాట్లో ఉంచుతారు. ఇరాన్, తుర్కియే, అప్ఘనిస్తాన్‌తో పాటు మరో తొమ్మిది దేశాలకు చెందిన 700 మంది హోమ్ మేకర్స్ ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారు.
సంక్రాంతికి ఊర్లకు వెళ్లినవారు కాకుండా హైదరాబాద్‌లో మిగిలిపోయినవాళ్లుంటే బోర్ కొట్టకుండా ఉండేందుకు కైట్ ఫెస్టివల్‌కు వెళ్లండి. అక్కడ మీరో పతంగి ఎగరేయండి. కైట్ ఫెస్టివల్ తెలంగాణ ప్రత్యేకత. ప్రపంచంలో ఏ రాష్ట్రమూ ఇంత గ్రాండ్‌గా కైట్ ఫెస్టివల్‌ను సెలబ్రేట్ చేసుకోదు.!