Interesting facts about : అస్సలు ఊహించలేరు.. విమానాల గురించి మనకు తెలియని వింతలు.. విశేషాలివే..

by Javid Pasha |   ( Updated:2024-09-04 13:07:27.0  )
Interesting facts about : అస్సలు ఊహించలేరు.. విమానాల గురించి మనకు తెలియని వింతలు.. విశేషాలివే..
X

దిశ, ఫీచర్స్ : ఆకాశంలో ఎగురుతూ పోయే విమానాలను మనం అప్పుడప్పుడూ చూస్తూ ఉంటారు. కొందరికైతే వాటిని చూడగానే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ఎందుకంటే బాల్యంలో ఆకాశంలో వెళ్తున్న విమానాలను చూసి తెగ సంబరపడిపోయేవాళ్లం అంటుంటారు చాలామంది. అంతేకాకుండా వాటి లోపల ఏముంటాయి? అనే సందేహాలు కూడా వెంటాడేవట. కానీ ప్రస్తుతం చాలామంది ఫ్లైట్లల్లో జర్నీ చేస్తున్నారు. చేయకపోయినా వాటి గురించి ఎంతో కొంత అవగాహన ఉంటుంది. కాకపోతే చాలామందికి తెలియని విషయాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంజిన్ ఫెయిలైనా బేఫికర్

ప్రస్తుతం ఆధునిక విమానాల్లో ఒకే ఇంజిన్ కనిపించినప్పటికీ అందులో డ్యుయల్ రోల్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. అంటే జర్నీలో ఉన్నప్పుడు ఒకటి ఫెయిల్ అయినా మరొక దానితో నడుస్తాయి. సేఫ్‌గా వెళ్లి ల్యాండ్ అవుతాయి. కాబట్టి ఫ్లైట్‌లో వెళ్తున్నప్పుడు ఇంజిన్‌లో ఏదైనా లోపం సంభవించినా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు.

ఎత్తుకు వెళ్లే కొద్దీ..

వినడానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు.. కానీ ఇది నిజం. విమానం ఎంత ఎత్తుకు వెళ్తే అంత మంచిది. దీనివల్ల దానిపై ప్రతికూల వాతావరణ ప్రభావం పడదు. పైగా అక్కడ ఎయిర్ థిన్‌గా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. అందుకే ఫ్లైట్‌లు 35 వేల అడుగుల ఎత్తులో నుంచి ప్రయాణిస్తుంటాయి. దీనికి ప్రధాన కారణం ఫ్యూయల్ ఖర్చు తగ్గించడమే.

పైలట్లకు వేర్వేరు భోజనాలు

ఒకే విమానంలో ప్రయాణిస్తున్నప్పటికీ పైలట్లు, కో పైలట్లు ఒకే రకమైన భోజనం తినరు. ఫుడ్ పాయిజనింగ్ రిస్క్‌ను నివారించడానికి ఇలా చేస్తారు. అంటే అనుకోని పరిస్థితిలో ఒకరు అనారోగ్యానికి గరైనా ఫ్లైట్‌ను సేఫ్‌గా నడిపించడానికి ఇంకొకరు సంసిద్ధంగా ఉండే ఉద్దేశంతో ఇలా ప్రిపేర్ చేస్తారు.

ప్రయాణంలో ఉండగా డోర్ తీయలేరు

బస్సులో అయితే అవసరం అయినప్పుడు డోర్ తెరవచ్చు. కానీ విమానంలో అలా కుదరదు. ఎందుకంటే ఫ్లైట్ లోపలి భాగంలో చాలా ఒత్తిడి ఉంటుంది. ఇక బయటి నుంచి అయితే గాలి పీడనం అధికంగా ఉంటుంది. ఈ రెండు వాతావరణాల మధ్య వ్యత్యాసం కారణంగానే డోర్ ఓపెన్ కాదు. ఒక వ్యక్తి లోపలి నుంచి ఫ్లైట్ డోర్‌ను తెరలేరు. దానిని తెరవాలంటే 9 వేల కిలో గ్రాములు ఎత్తడానికి కావాల్సినంత ఎనర్జీ అవసరం అవుతుంది.

ఆహారాలు రుచిగా ఉండవ్

ఫ్లైట్‌లో వెళ్తున్నప్పుడు తినడానికి ఇచ్చే వివిధ స్నాక్స్ వాస్తవానికి భూమిపై ఉన్నప్పుడు ఉన్నంత రుచిగా ఉండవు. ఎందుకంటే అక్కడ క్యాబిన్‌లోపల ఉండే తక్కువ గాలి ఒత్తిడి, పొడిగాలి కారణంగా ఆహారం రుచి తగ్గుతుంది. ఉప్పగా, తీపిగా మారుతుంది.

చల్లటి గాలిలోనూ మెరుగ్గా..

విమానాలు ఎత్తులో వెళ్తున్నప్పుడు చల్లటి గాలి ఉన్నప్పటికీ వాటి ఇంజన్లు ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. గాలి 50 డిగ్రీల సెల్సియస్ (-58 degrees Fahrenheit) వరకు చల్లగా ఉన్నప్పటికీ ఇంజన్లపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదు. పైగా ఎఫెక్టివ్‌గా కంప్రెస్ చేయగలవు. ఫ్యూయల్‌ని చక్కగా వినియోగించుకుంటాయి.

ఫోన్ వాడకూడదు !

ప్రతీ ఫోన్లో ఫ్లైట్ మోడ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఫ్లైట్‌లో జర్నీ చేసినప్పుడు దానిని ఆన్ చేయాలి. లేకపోతే అది ఫ్లైట్ ఎక్విప్‌మెంట్‌కి అంతరాయం కలిగించచ్చునని నిపుణులు చెప్తున్నారు. గ్రౌండ్ నెట్వర్క్‌లలో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి ఫోన్లు ఫ్లైట్ మోడ్‌లో ఉంచడం ముఖ్యం. పైగా ఎయిర్ ప్లేన్ క్యాబిన్‌లు ఫెడరే కేజ్‌ల మాదరి ఉంటాయి. ఇవి చాలా వరకు సిగ్నల్స్‌ను బ్లాక్ చేస్తాయి.

పిడుగులుపడినా ఏం కాదు

ఫ్లైట్‌లో వెళ్తున్నప్పుడు సడెన్‌గా ఉరుములు, మెరుపులు రావడం, పిడుగులు పడటం జరిగితే ఏంటి పరిస్థితి? అనే సందేహం కూడా కొందరికి రావచ్చు. కానీ చింతించాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. ఎందుకంటే విమానం మెటల్ బాడీ ఫెడరేజ్ కేజ్ మాదిరి పనిచేస్తుంది. మెరుపు లేదా పిడుగు నుంచి వచ్చే విద్యుత్ తరంగాలు విమానాన్ని సమీపించినా దానిపైకి రావు చుట్టూ ప్రసరిస్తూ పక్కకువెళ్లి పోతాయి. కాబట్టి నో ప్రాబ్లం.

Advertisement

Next Story

Most Viewed