తెలివైన వాళ్లంటే ఎవరు?.. నిపుణుల ప్రకారం వారిలో కనిపించే కొన్ని సాధారణ లక్షణాలివే..

by Dishafeatures2 |
తెలివైన వాళ్లంటే ఎవరు?.. నిపుణుల ప్రకారం వారిలో కనిపించే కొన్ని సాధారణ లక్షణాలివే..
X

దిశ, ఫీచర్స్ : ఫలానా వ్యక్తి మంచివాడు లేదా తెలివైనవాడు అనే మాటలు మనం తరచూ వింటుంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో ఆమె వెరీ ఇంటెలిజెంట్, అతను వెరీ టాలెంటెడ్ అని కూడా చెప్తుంటాం. అయితే ఎవరు ఎలాంటి వారు అనేది ఎలా తెలుస్తుంది? ఆయా వ్యక్తుల్లో మేధస్సు లేదా తెలివిని నిరూపించగల సంకేతాలేంటి? అనే సందేహాలు మీకెప్పుడైనా కలిగాయా? కానీ నిపుణులు తెలివైన వ్యక్తుల్లో సాధారణంగా కనిపించే పలు సంకేతాలను విశ్లేషిస్తున్నారు. కొన్నిసార్లు వ్యక్తుల్లోని తెలివైన లక్షణాలు లేదా సంకేతాలు బయటకు స్పష్టంగా కనిపించకపోవచ్చు. కానీ అలాంటి వ్యక్తుల్లో కూడా మీరు అనుకున్నదానికంటే ఎక్కువ తెలివితేటలు ఉండవచ్చునని నిపుణులు చెప్తున్నారు. అటువంటి సంకేతాలేవో వివరిస్తున్నారు.

అనుమానం, క్యూరియాసిటీ

తెలివైన వ్యక్తుల్లో కనిపించే సంకేతం లేదా లక్షణాల్లో ఒకటి విషయాలపట్ల డౌట్స్ రావడం. ముఖ్యంగా తాము చేసే వర్కు విషయంలో అనుమానాలు, ఆసక్తి, క్యూరియాసిటీని కలిగి ఉంటారు. డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి అనేక ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు రాబట్టాలని చూస్తారు. కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఇష్టపడతారు. మీరు అనేక విషయాల్లో ఎల్లప్పుడూ ఎందుకు?, ఎలా? అని ఆలోచిస్తూ ఉంటే అది మీలోని ఇంటెలెక్చువల్ క్యూరియాసిటీకి నిదర్శనం.

మార్పుల పట్ల సానుకూలత

ఇంటెలిజెన్స్ ఎల్లప్పుడూ ఒకే తరహా ఆలోచనలకు పరిమితం కారు. సహజంగానే వారు కొత్త కొత్త ఆలోచనలు, మార్పుల పట్ల సానుకూలంగా ఉంటారు. అలాగే మార్పులను, వాటి పర్యవసనాలను సులభంగా హ్యాండిల్ చేయగలుగుతారు. సమస్యలు ఎదురైనా పరిష్కారాలను కనుగొనే ప్రయత్నం చేస్తారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా పాజిటివ్ దృక్పథంతో సర్దుకుపోయే లక్షణం ఎవరిలో ఉన్నా అది తెలివితేటలకు నిదర్శనం.

ఓపెన్ మైండెడ్

తెలివైనవారు అనవసర విషయాలను ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడరు. తమపని తాము చేసుకుంటూ పోతుంటారు. అలాగే వీరు తరచూ వీరు ఓపెన్ మైండెడ్‌తో కలిసి ఉంటారు. తమకు తెలిసిన విషయాలను ఇతరులకు చెప్పడానికి, నేర్పించడానికి వెనుకాడరు. విభిన్న పరిస్థితులను అర్థం చేసుకోవడంలో, కొత్త ఇన్ఫర్మేషన్ ఆధారంగా అభిప్రాయాలను మార్చుకోవడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. మీరు కొత్త ఐడియాలతో ముందుకు వెళ్లాలనుకుంటారు.

సెన్స్ ఆఫ్ హ్యూమర్

నమ్మకంతోపాటు గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కలిగి ఉండటాన్ని తెలితేటలకు సంకేతంగా పరిగణిస్తారు నిపుణులు. ఇంటెలిజెన్స్ ఎప్పుడూ చమత్కారంగానూ ఉంటారు. వీరు తమకు సంబంధం లేని విషయాలను కూడా అర్థం చేసుకోవడంలో, కొత్త సంబంధాలను ఏర్పర్చడంలో తెలివిగా వ్యవహరిస్తారు. హాస్య చతురతను కూడా ప్రదర్శిస్తుంటారు.

సానుభూతి

మేధస్సు ఎంత ముఖ్యమో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా అంతే ముఖ్యం అంటున్నారు నిపుణులు. తెలివైన వ్యక్తులు తరచుగా సానుభూతితో ఉంటారు. ఆయా పరిస్థితులను, సందర్భాలను ఇతరులు ఎలా భావిస్తున్నారో అర్థం చేసుకోగలుగుతారు. వ్యక్తుల భావోద్వేగాలను అంచనా వేయడంలో, అర్థం చేసుకోవడంలో, సపోర్ట్ చేయడంలో ముందుంటారు.

సెల్ఫ్ అవేర్‌నెస్

తెలివైన వ్యక్తుల్లో కనిపించే మరో లక్షణం సెల్ఫ్ అవేర్‌నెస్. వారు తమ బలాలు, బలహీనతలను సమీక్షించుకుంటారు. ఎల్లప్పుడూ తమను తాము మెరుగు పరచుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఆత్మ పరిశీలన చేసుకుంటూ స్వీయ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుంటారు.

పట్టుదల

ఇంటెలిజెన్స్ ఏ విషయాన్నీ అంత సులువుగా స్వీకరించరు. ఒకవేళ స్వీకరిస్తే అంత ఈజీగా వదలరు. లక్ష్యసాధనకోసం పట్టుదలతో ఉంటారు. అడ్డంకులు ఎదురైనా అనుకున్నది సాధించడానికే ప్రయత్నిస్తుంటారు. ఈ సంకేతాలు లేదా లక్షణాలు ఎవరిలో కనిపించినా తెలివైన వ్యక్తులుగా భావించవచ్చునని నిపుణులు చెప్తున్నారు.

Next Story