వ‌ర‌మాల నిరాక‌రించిన వ‌ధువు.. చివ‌రికి సిగ్గువ‌దిలి వ‌రుడు ఇలా..?! (వీడియో)

by Sumithra |
వ‌ర‌మాల నిరాక‌రించిన వ‌ధువు.. చివ‌రికి సిగ్గువ‌దిలి వ‌రుడు ఇలా..?! (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః భారతీయ‌ వివాహాల్లో సంప్రదాయాలు, మ్యూజిక్‌, డ్యాన్స్‌ లాంటి చాలా స‌ర‌దా తంతులు ఉంటాయి. ఈ దేశంలో ఒక్కో ప్ర‌దేశంలో, ఆయా క‌మ్యూనిటీల సంప్ర‌దాయాల‌ను బ‌ట్టి పెళ్లి కార్య‌క్ర‌మం ఉంటుంది. అలాగే, పంజాబీ వివాహాల్లో వివాహ వేడుక జయమాల మార్పిడితో ప్రారంభమవుతుంది. ఈ వేడుకలో, వధువు, వరుడు కొన్నిసార్లు జయమాల వేయించుకోకుండా ఒకరినొకరు ఆటపట్టించుకుంటారు. కానీ చివరికి సంతోషంగా క‌లుసుకుంటారు. ప్ర‌స్తుతం, ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో కూడా ఇలాంటి సంద‌ర్భ‌మే ఒక‌టి వైర‌ల్ అయ్యింది. అయితే, ఇందులో వరుడు కాస్త స్మార్ట్‌గా ఆలోచించి వ‌ధువును సంతృప్తిప‌రుస్తాడు. వివాహ వేడుక ప్రారంభం కాగానే, వరుడు జయమాల మెడలో వేయడానికి పట్టుకుంటాడు. కానీ, వధువు వద్దు అని సరదాగా తల ఊపుతూ, వెన‌క్కు వంగుతుంటుంది. కాసేపు, ప్ర‌య‌త్నించి సిగ్గుప‌డిన వ‌రుడు త‌ర్వాత సోఫాలో కూర్చుండిపోతాడు. అయితే, అలా కాదు మ‌రోలా ప్ర‌య‌త్నించాల‌నుకున్న వ‌ర‌డు సినిమా స్టైల్లో ఆమె ముందు మోకాలిపై కూర్చొని, మాల వేయించుకోమ‌న్న‌ట్లు ప్ర‌పోజ్ చేస్తాడు. వెంటనే వ‌ధువు కూడా కాబోయే భ‌ర్త చేసిన స్మార్ట్ ఉపాయానికి మెచ్చి, త‌ల వంచి వ‌ర‌మాల వేయించుకుంటుంది. ఇంత స‌ర‌దా సంద‌ర్భాన్ని మీరూ చూసి స‌ర‌దాగా న‌వ్వుతూ ఆనందించండి.

Advertisement

Next Story