దీపావళి నోము.. లక్ష్మీ మాతకు శంఖం సమర్పిస్తే సంపద ప్రాప్తి

by sudharani |   ( Updated:2022-10-21 13:15:35.0  )
దీపావళి నోము.. లక్ష్మీ మాతకు శంఖం సమర్పిస్తే సంపద ప్రాప్తి
X

దిశ, ఫీచర్స్: మరికొద్ది రోజుల్లో రాబోతున్న 'దీపావళి'ని వైభవంగా జరుపుకునేందుకు భారతీయులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రత్యేక దివాళీ పూజను ఎలా నిర్వహించాలో చర్చించుకుంటున్నారు. ఇది కేవలం ప్రేమ మరియు కాంతికి సంబంధించిన వేడుక మాత్రమే కాదు. ఈ ఏడాది మొత్తం ఇంటి సంపద, శ్రేయస్సును ఆహ్వానించేందుకు 'లక్ష్మీ దేవి' ఆశీర్వాదాలు పొందే పండుగ. కాబట్టి ఈ పూజను నిర్వహించే ఉత్తమమైన, సరైన మార్గం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకు సంబంధించిన ఆచారాలను నిర్వహించేటప్పుడు, లక్ష్మీ మాతకు ప్రియమైన వస్తువులను సమర్పించుకోవడం ముఖ్యం. అందుకే ఈ సంవత్సరం పూజ సమయంలో అమ్మవారికి శంఖాన్ని సమర్పించాలంటున్న పెద్దలు.. దీనివలన ఇంట్లో ఎలాంటి శుభాలు కలుగుతాయో వివరిస్తున్నారు.

దీపావళి పూజకు 'శంఖం' ఎందుకు?

'శంఖం' లక్ష్మీదేవికి ప్రియమైనదిగా పరిగణించబడుతుంది. అమృతం కోసం దేవతలు, రాక్షసులు.. 'క్షీరసాగర మథనం' జరిపినప్పుడు సముద్రం నుంచి 'లక్ష్మీ దేవి','శంఖం' కనిపించిందని నమ్ముతారు. అందుకే ఈ రోజున శంఖాన్ని శుభ్రం చేసి దాన్ని గంగాజలంతో నింపాలని భక్తులకు సూచిస్తున్నారు. దీపావళి సందర్భంగా దక్షిణవర్తి శంఖాన్ని ఇంటికి తీసుకురావడం శుభప్రదంగా భావిస్తారు. ఈ గంగాజలంతో నింపిన శంఖాన్ని దీపావళి పూజ సమయంలో అమ్మవారి విగ్రహం ముందు ఉంచి.. 'ఓం శ్రీ లక్ష్మీ సహోదరాయై నమః' అని 108 సార్లు జపించాలి. దీపావళి ఉత్సవాలు ముగిసిన తర్వాత, గంగాజలాన్ని మొక్కలకు పోసి, శంఖాన్ని ఎర్రటి గుడ్డలో చుట్టి భద్రంగా ఖజానాలో దాచుకోవాలి.

ఇంట్లో దక్షిణావర్తి శంఖాన్ని ఉంచడం వల్ల అది మీ ఇంటిని ప్రతికూల శక్తుల నుంచి కాపాడుతుంది. చెడు కన్ను పడకుండా, కుటుంబ సభ్యులకు హాని కలిగకుండా, ఆర్థిక ఒత్తిడిని వదిలించుకోవడానికి సహాయపడుతుందని నమ్ముతారు. ఆనందం, ఆరోగ్యంతో పాటు సంపదలు వెల్లివిరుస్తాయని చెప్తున్నారు పెద్దలు.

ఇవి కూడా చదవండి :

గ్రీన్ క్రాకర్స్ .. గాలి నాణ్యత తక్కువ ఉన్న నగరాల్లోనే అనుమతి

Advertisement

Next Story