- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొవిడ్ తర్వాత ప్రజల్లో ఇమ్యూనిటీ పవర్ బాగా పెరిగింది.. అధ్యయనంలో వెల్లడి
దిశ, ఫీచర్స్: కరోనా వైరస్ ప్రభావం, ఆ తర్వాత వచ్చిన వివిధ వేరియంట్లు, వాటి నివారణకు తీసుకున్న టీకాలు మనుషుల్లో సహజమైన ఇమ్యూనిటీ పవర్‌ను పెంచాయా..? భవిష్యత్తులో ప్రమాదకరమైన వ్యాధులు, వివిధ వేరియంట్ల నుంచి ఈ ఇమ్యూనిటీ పవర్ మనల్ని రక్షిస్తుందా?.. తాజా అధ్యయనం అవుననే చెప్తోంది. కోవిడ్ బారి నుంచి రక్షణ కోసం, వివిధ వ్యాధులు, వేరియంట్లు రాకుండా ఆ తర్వాత కూడా ఇన్‌ఫెక్షన్లు సోకకుండా తీసుకున్న కొవిడ్ నివారణ టీకాలు మనుషుల్లో ఇమ్యూనిటీ పవర్‌ను బాగా పెంచాయని లాన్సెట్ జర్నల్‌లో పబ్లిషైన ఒక అధ్యయనం పేర్కొన్నది.
కోవిడ్ బారిన పడి కోలుకున్న తర్వాత ప్రజలు మళ్లీ ఇన్‌ఫెక్షన్స్ బారిన పడే అవకాశాలు, ఇతర వ్యాధులు వచ్చే అవకాశాలు 88 శాతం మేర తగ్గాయని నిపుణులు అంచనా వేశారు. కొవిడ్‌కు వ్యతిరేకంగా పనిచేయగల ఫైజర్ లేదా మోడర్నా తదితర వ్యాక్సిన్లు రెండు డోసులు వేసుకున్న తర్వాత సహజమైన రోగనిరోధక శక్తి ప్రజల్లో పెరిగిందని పరిశోధకులు స్పష్టం చేశారు.
ఇన్ఫెక్షన్స్ తగ్గాయి..
అన్ని వేరియంట్‌ల ద్వారా తిరిగి వచ్చే ఇన్ఫెక్షన్స్ కూడా ఇప్పుడు బాగా తగ్గిపోయాయని అధ్యయనంలో తేలింది. తొలుత వచ్చిన కరోనా, తదితర వేరియంట్ల నుంచి రక్షణ కోసం వేసుకున్న టీకాలే ఇందుకు దోహదం చేశాయని ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (IHME) ఆధ్వర్యంలో నిర్వహించిన అధ్యయనం స్పష్టం చేసింది.
ఈ విషయం తెలుసుకునేందుకు పరిశోధకులు గత సంవత్సరం సెప్టెంబర్ వరకు 19 దేశాల నుంచి 65 అధ్యయనాలను సమీక్షించారు. ప్రస్తుతం కరోనా, ఒమిక్రాన్, ఇతర వేరియంట్లు గతంలాగా ప్రభావితం చేయలేవని, అంతకు మించి వేరే వేరియంట్లు వచ్చినా వాటిని ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి ప్రజల్లో ఏర్పడి ఉందని అంచనాకు వచ్చారు. మెటా, ఆల్ఫా, బీటా వంటి టెక్నాలజీ విశ్లేషణలు కూడా ఇదే స్పష్టం చేశాయి.
కరోనాతో పోల్చినప్పుడు ఆ తర్వాత వచ్చిన వైరస్ ఒమిక్రాన్ చాలా ప్రమాదకరమైనది. అంతేగాక వేగంగా వ్యాప్తి చెందే లక్షణం కలది కూడాను. కానీ ఇది ప్రపంచ ప్రజలను వ్యాక్సిన్ రాకముందు కరోనా లాగా ప్రభావం చూపలేకపోయింది. ఇన్ఫెక్షన్లు కూడా కలిగించలేక పోయింది. కరోనాకు విరుగుడుగా వేసుకున్న వ్యాక్సిన్ల వల్ల ప్రజల్లో పెరిగిన ఇమ్యూనిటీ పవరే ఇందుకు కారణం. ప్రస్తుతం ఒమిక్రాన్, తదితర వేరియంట్లు వచ్చినా తట్టుకొని వాటిని తిప్పి కొట్టగలిగే రోగ నిరోధక శక్తి ప్రజల్లో ఉందని అధ్యయనం స్పష్టం చేసింది.