- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇన్‌స్టాలో అవి చూస్తే రిస్క్‌లో పడ్డట్టే.. లక్షలు పోగొట్టుకున్న వ్యక్తి!
దిశ, ఫీచర్స్: ప్రస్తుత రోజుల్లో చాలా మంది సోషల్ మీడియాలకు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. అందులోనే ఎక్కువగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఇన్‌స్టాలో రీల్స్ చూస్తూ.. వాటిని షేర్ చేస్తూ ఆనందాన్ని పొందుతున్నారు. అయితే.. రీల్స్ చూడటం, షేర్ చెయ్యడం వరకు పర్లేదు. కానీ.. ఈ మధ్య కాలంలో యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్‌స్టాలో ఎక్కువగా యాడ్స్ కూడా వస్తున్నాయి. వీటిల్లో పెడ్డుబడి పెడితే ఈజీగా మనీ సంపాదించుకోవచ్చని తెలుపుతున్నారు. చెమట చుక్క చిందించకుండా ఈజీగా డబ్బులు సంపాదించేయోచ్చు అని ఆ యాడ్ ఓపెన్ చేశారో అంతే సంగతి. లక్షల్లో డబ్బులు పోగొట్టుకోవడం ఖాయం. తాజాగా ఇలాంటి పరిస్థితితే ఓ వ్యక్తికి ఎదురైంది. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
నరేష్ అనే వ్యక్తి ఇన్‌స్టా చూస్తూ ఇండోర్ సిటీకి చెందిన ‘ఎసెన్స్ ఇన్వెస్ట్మెంట్’ అనే కంపెనీకి చెందిన యాడ్ చూసి వారిని సంప్రదించాడు. వారు తమ వద్ద ఇన్వెస్ట్ చేస్తే.. తక్కువ కమిషన్ తీసుకుని ఎక్కువ లాభాలు వచ్చేలా చేస్తామని నమ్మించారు. కంపెనీ వెబ్ సైట్‌లో అడ్రస్, మెయిల్ ఐడీ, సెబీ రిజిస్ట్రేషన్ నంబర్ ఉండడంతో నరేష్ నమ్మాడు. దీంతో ఆ కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ చేశాడు. విడతల వారిగా మొత్తం రూ. 10 లక్షలు వరకు ఇన్వెస్ట్ చేశారు. కొంత లాభం రావడంతో డబ్బులు విత్‌డ్రా చేయాలి అనుకున్నాడు. కానీ వాళ్లు ఇంకా ఇన్వెస్ట్ చేస్తే ఇంకా లాభం వస్తుందని చెప్పడంతో.. ఆశతో మరో రూ. 8 లక్షలు తెచ్చి పెట్టుబడి పెట్టారు. వాళ్ళు చెప్పినట్టే 18 లక్షల పెట్టుబడి 28 లక్షలు అయ్యింది.
ఇక లాభాలు రావడంతో ఆ డబ్బులు తీసుకుందాం అనుకున్నాడ నరేష్. కానీ, డబ్బులు తియ్యాలంటే రూ. 3లక్షలు పన్ను చెల్లించాలి చెప్పారు. ఇంకేముంది అది నమ్మిన నరేష్ నెట్ బ్యాంకింగ్ ద్వారా వారికి 3 లక్షలు చెల్లించారు. ఇక వెంటనే ఫోన్ స్విచ్చాఫ్ చేసి పెట్టుకున్నారు ‘ఎసెన్స్ ఇన్వెస్ట్మెంట్’ అనే కంపెనీ వాళ్లు. తర్వాత వాట్సాప్‌లో సంప్రదించినా రెస్పాన్స్ లేదు. దీంతో మోసపోయానని గ్రహించిన నరేష్.. ఆన్ లైన్ సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు. ఒక స్టాక్ మార్కెట్ ప్రకటన చూసి నరేష్ రూ. 21 లక్షలు కోల్పోయారు. కాబట్టి.. ఇన్‌స్టా, యూట్యూబ్, ఫేస్ బుక్ లాంటి వాటిలో వచ్చే యాడ్స్ చూసి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.