- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హెయిర్ స్టైలింగ్ చేసేటప్పుడు ఈ తప్పులు చేశారో.. జుట్టు రాలడం ఖాయం..
దిశ, ఫీచర్స్ : మహిళలకు జుట్టు అందాన్ని పెంచుతుంది. అలాంటి జుట్టును జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. మహిళలు పార్టీలకు, ఫంక్షన్ లకు వెళ్ళేటప్పుడు వివిధ రకాల హెయిర్ స్టైల్ ను వేసుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో కొన్ని తప్పులను కూడా చేస్తుంటారు. దాంతో జుట్టు రాలడం మొదలవుతుంది. మీరు కూడా అలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారా. మరి ఆ పొరపాట్లు ఏంటి. వాటిని ఎలా సరిదిద్దుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వకూడదు..
చాలామంది జుట్టు తడిగా ఉన్నప్పుడు హెయిర్ ను దూసి జుట్టు వేసుకుంటారు. కానీ దీని కారణంగా వారి జుట్టు తెగిపోతూ ఉంటుంది. అలాగే తడి జుట్టు ఆరేందుకు హెయిర్ డ్రైయర్ ఉపయోగించడం కూడా హానికరమే అంటున్నారు నిపుణులు. దీని వల్ల జుట్టు మరింత దెబ్బతింటుందని చెబుతున్నారు.
హెయిర్ స్ప్రే వాడకాన్ని తగ్గించాలి..
హెయిర్ స్టైల్ చేసేటప్పుడు హెయిర్ బ్రేకేజీని నివారించడానికి హెయిర్ స్ప్రేని తక్కువగా ఉపయోగించాలంటున్నారు నిపుణులు. ఈ హెయిర్ స్ప్రే జుట్టును లోపలి నుంచి దెబ్బతీస్తుందని చెబుతున్నారు. దీని వల్ల స్కాల్ప్ కూడా బలహీనంగా మారుతుందట. దీంతో జుట్టు కూడా రాలడం మొదలవుతుంది. మీ జుట్టును స్టైల్ చేసినప్పుడల్లా, హెయిర్ స్ప్రేని తక్కువగా ఉపయోగించండి.
జుట్టును ఎక్కువగా బిగించవద్దు..
హెయిర్ స్టైల్ చేసేటప్పుడు జుట్టును ఎక్కువగా బిగించకూడదని గుర్తుంచుకోవాలి. హెయిర్ స్టైల్‌ను కొద్దిగా వదులుగా ఉంచాలి. టైట్ గా జుట్టువేయడం వల్ల జుట్టు మూలాలు బలహీనంగా మారతాయంటున్నారు. అందుకే జుట్టును వదులుగా వేసుకోవాలట. జుట్టు వేసుకునేటప్పుడు సులభమైన హెయిర్ స్టైల్ చిట్కాలను అనుసరించాలి.