అన్నం తిన్నా థైరాయిడ్ పెరుగుతుందా?.. నిపుణులు ఏం చెప్తున్నారు?

by Javid Pasha |   ( Updated:2024-02-24 12:57:26.0  )
అన్నం తిన్నా థైరాయిడ్ పెరుగుతుందా?.. నిపుణులు ఏం చెప్తున్నారు?
X

దిశ, ఫీచర్స్ : మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా హార్మోన్ రిలేటెడ్ ఇబ్బందులు పలువురిని వేధిస్తున్నాయి. కొన్నిసార్లు అప్పటికే ఉన్న సమస్యలు మరింత అధికం అవుతున్నాయి. అలాంటి వాటిలో థైరాయిడ్ కూడా ఒకటి. ప్రస్తుతం చాలామందిలో ఇదొక సమస్యగా మారుతోంది. అయితే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నవారు అన్నం తినకూడదని, తింటే థైరాయిడ్ మరింత అధికం అవుతుందని కొందరు నమ్ముతుంటారు. మరి ఇందులో వాస్తవమెంత? నిపుణులు ఏం చెప్తున్నారు?

నిజానికి అన్నం తినకుండా ఎవరూ ఉండలేరు. కాకపోతే మూడు పూటలా అన్నాన్నే తినడం అనేది కొందరి విషయంలో ఇబ్బందులకు కారణం కావచ్చునని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవారు రోజూ మూడు పూటల వైట్‌రైస్ తినడంవల్ల అధిక బరువు పెరిగే అవకాశం ఉందట. దీంతోపాటు మెత్తటి‌ వైట్‌రైస్ థైరాయిడ్ లెవల్స్ పెరగానికి దోహదం చేస్తుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారు, థైరాయిడ్ అదుపులో ఉంచుకోవాలనుకునేవారం అన్నం తినవద్దని చెప్తుంటారు. బదులుగా బ్రౌన్ రైస్ తీసుకోవచ్చునట.

గ్లూటెన్ కారణంగానే అసలు సమస్య

అన్నం తింటే థైరాయిడ్ పెరుగడానికి అసలు కారణం గ్లూటేన్ అనే ప్రోటీన్. ఇది బియ్యంలో సహజంగానే ఉంటుంది. అధిక థైరాయిడ్‌తో బాధపడేవారిలో సమస్యను మరింత పెంచుతుందని, థైరాక్సిన్ హార్మోన్ లెవల్స్‌లో మార్పులకు కారణం అవుతుందని నిపుణులు చెప్తున్నారు. పైగా అన్నంలోని పిండిపదార్థాల కారణంగా తినగానే ఈ ప్రోటీన్ అన్నంతోపాటు ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఫలితంగా థైరాయిడ్, అధిక బరువు, టైప్ -2 డయాబెటిస్ పెరుగుదలను ప్రేరేపిస్తుంది. అన్నానికి బదులు రొట్టె తినడంవల్ల ఇలాంటి సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఒకవేళ అన్నం తినకుండా ఉండలేమని భావించేవారు అన్ని రకాల వెజిటేబుల్స్ మిక్స్ చేసి వండుకొని, లిమిట్‌గా తినవచ్చునని నిపుణులు చెప్తున్నారు. ఇక రొట్టెను ఆహారంలో భాగంగా చేసుకోవడం, అన్నం కాస్త తక్కువగా తినడం లేదా తగ్గించడం థైరాయిడ్ సమస్యను నివారించడంలో సహాయపడుతుంది.

Read More..

టిఫిన్ తిన్న వెంటనే టీ తాగుతున్నారా?

Advertisement

Next Story

Most Viewed