జాజికాయ‌తో ఇలా చేస్తే.. మీ ముఖం మెరిసిపోతుంది!

by Prasanna |   ( Updated:2023-08-11 13:13:38.0  )
జాజికాయ‌తో ఇలా చేస్తే.. మీ ముఖం మెరిసిపోతుంది!
X

దిశ, వెబ్ డెస్క్: అందంగా కనిపించాలని ప్ర‌తి ఒక్కరు కోరుకుంటారు. దాని కోసం పెద్ద మొత్తంలో ఖ‌ర్చు పెడుతుంటారు. కానీ మ‌న‌లో చాలా మంది ముఖంపై మ‌చ్చ‌లు, ముడ‌త‌లు, మొటిమ‌లు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతుంటారు. దీనికి గల ప్రధాన కారణాలు ఎండ‌లో తిర‌గ‌డం, ఒత్తిడి, జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వలన అంద‌విహీనంగా మారుతుంటారు. ముఖాన్ని అందంగా మార్చుకునేందుకు మార్కెట్లో దొరికే బ్యూటీ ప్రొడ‌క్ట్స్ ను వాడుతుంటారు. అయినా ఫలితం ఉండదు. మ‌న ఇంట్లో ఉండే జాజికాయ‌ను ఉప‌యోగించి మ‌నం మ‌న ముఖాన్ని అందంగా మార్చుకోవ‌చ్చు. జాజికాయ‌ను మ‌నం మ‌సాలా దినుసులుగా మాత్ర‌మే ఉపయోగిస్తుంటాము. కానీ ఇది ముఖాన్ని అందంగా మార్చ‌డంలో మ‌న‌కు సహాయపడుతుంది. ముఖాన్ని అందంగా, కాంతివంతంగా మార్చుకోవ‌డానికి జాజికాయ‌ను ఎలా ఉపయోగిస్తారో ఇక్కడ చూద్దాం..

జాజికాయ‌ పేస్ ప్యాక్

దీని కోసం ఒక గిన్నెలో అర టీ స్పూన్ జాజికాయ పొడి, అర టీ స్పూన్ చంద‌నం పొడిని తీసుకొని దీనిలో కొద్దిగా నీరు పోస్తూ పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత ఈ పేస్ట్ ను ముఖానికి రాసుకుని నెమ్మ‌దిగా మ‌ర్ద‌నా చేయాలి. కొంత సేపటి తర్వాత చ‌ల్ల‌టి నీటితో మొఖాన్ని శుభ్రపరచుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ మొఖానికి వేసుకోవడం వలన మొటిమ‌లు, మ‌చ్చ‌లు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

Read More: మీ గోర్ల పైన ఇలా ఉందా.. నిర్ల‌క్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వ‌స్తుంది?

Advertisement

Next Story