యాలకులతో ఇలా చేస్తే.. మీ ముఖం మెరిసిపోతుంది..!

by Kanadam.Hamsa lekha |
యాలకులతో ఇలా చేస్తే.. మీ ముఖం మెరిసిపోతుంది..!
X

దిశ, ఫీచర్స్: అందంగా కనిపించాలనేది ప్రతీ ఒక్కరి కోరిక. ముఖ్యంగా యువకులు, మహిళలు తమ ముఖ సౌందర్యాన్ని పెంచుకోవడం కోసం రకరకాల క్రీమ్, ఫేస్ ప్యాక్, స్క్రబ్‌లు ఉపయోగిస్తూ.. ఇబ్బంది పడుతుంటారు. కొన్నిసార్లు రాత్రిపూట సరిగా నిద్ర లేకపోతే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తాయి. ఇలా రాకుండా ఉండాలంటే.. మంచి ఆహారం తీసుకోవడంతో పాటుగా ప్రతీ రోజూ తగినంత నీటిని తీసుకోవడం కూడా ముఖ్యమే. అయితే, చర్మాన్ని కాంతివంతగా చేయడానికి యాలకుల నీరు ఉపయోగపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

చర్మాన్ని మెరిపించడానికి యాలకుల నీరు దోహదపడుతుంది. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ మొటిమలను తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. యాలకుల నీరు చర్మంలోని బాక్టీరియా, పగుళ్లను తగ్గిస్తుంది.

ఇలా సిద్ధం చేసుకోండి:

2-3 యాలకుల గింజలు

1 లీటర్ నీరు

నిమ్మకాయ (అవసరమైతే)

తయారు చేసుకునే పద్ధతి:

ముందుగా యాలకుల గింజలను పొడిగా చేసుకోవాలి. తరువాత మరిగే నీటిలో ఈ పొడిని వేసుకొని, గోధుమ రంగు వచ్చే వరకు 10 నిమిషాలు మరిగించుకోవాలి. అందులో మూడు చుక్కల నిమ్మరసంను కలుపుకోవాలి. ఈ నీటిని గోరువెచ్చగా చేసుకొని ప్రతీ రోజు ఉదయం, రాత్రి సమయంలో తాగడం వల్ల ఫలితం ఉంటుంది.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు.

Advertisement

Next Story