ఇంటి గుమ్మం ముందు ఈ వస్తువులను పెడితే దరిద్రమా?

by Hamsa |   ( Updated:2023-03-11 04:00:58.0  )
ఇంటి గుమ్మం ముందు ఈ వస్తువులను పెడితే దరిద్రమా?
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా చాలా మంది ఇంటిని తమకు నచ్చినట్టుగా నిర్మించుకుంటారు. అలాగే తమకు ఇష్టమైన వస్తువులను ఇంటి లోపల, బయట అలంకరించుకుంటారు. అయితే ఇవన్నీ వాస్తు ప్రకారం లేకుండా ఇష్టానుసారంగా వాస్తుకు విరుద్ధంగా పెట్టకూడదు. అలా చేయడం వల్ల ముందు ముందు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇంటి ప్రధాన గుమ్మం ముందు వస్తువులు పెట్టేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. వాస్తు ప్రకారం ఇంటి ముందు ఈ వస్తువులను పెట్టకపోవడం వల్ల ఏ విధమైన ఇబ్బందులు రావు.

ఇంటి ప్రధాన ద్వారం ముందు చెత్త బుట్ట ను పెట్టకూడదు. పెద్ద వృక్షాలు ఉండటం వల్ల ఇంట్లో చిన్న పిల్లలపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. కాబట్టి గుమ్మం ఎదురుగా పెద్ద పెద్ద వృక్షాలు లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా కరెంట్ స్తంభాలు ఉంటే ఇంటి పై నెగిటివ్ ప్రభావం పడి మహిళలకు ఇబ్బందులు ఎదురవుతాయి. చెప్పులను ఇంటికి ఎదురుగా వదిలితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. అందువల్ల ఇంటి ముందు ఏవైనా వస్తువులు పెట్టే ముందు వాస్తు ప్రకారం ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి.

Read more:

ఇంట్లో డబ్బులు నిలవడం లేదా.. ఈ వాస్తు టిప్స్ పాటించండి

Advertisement

Next Story

Most Viewed