ఫ్యాన్ తక్కువ స్పీడ్‌లో పెడితే , తక్కువ కరెంట్ బిల్లు వస్తుందా?.. నిపుణులు ఏం చెప్తున్నారంటే..

by Dishafeatures2 |
ఫ్యాన్ తక్కువ స్పీడ్‌లో పెడితే , తక్కువ కరెంట్ బిల్లు వస్తుందా?.. నిపుణులు ఏం చెప్తున్నారంటే..
X

దిశ, ఫీచర్స్ : వేసవి ప్రభావం కారణంగా ఉక్కబోతలు మరింత పెరుగుతున్నాయి. వేడి వాతావరణాన్ని, వడగాడ్పులను తట్టుకోలేక చాలామంది ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు హై స్పీడులో వాడుతున్నారు. దీంతో కరెంటు బిట్లు కూడా విపరీతంగా పెరిగిపోతోంది. అయితే ఫ్యాన్లు వాడినప్పటికీ బిల్లు పెరగకూడదనే సందేహాలు కూడా పలువురిలో వ్యక్తం అవుతుండగా.. పలువురు ఫ్యాన్, కూలర్, ఏసీ ఇలా ఏవైనా సరే తక్కువ స్పీడులో పెడితే తక్కువ కరెంటు కాలుతుందని, తక్కువ బిల్లు వస్తుందని నమ్ముతుంటారు. ఇది నిజమా? నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం.

సమ్మర్ కాబట్టి చాలామంది వేడి నుంచి ఉపశమనం కోసం ఫ్యాన్, కూలర్, ఏసీ ఫుల్లు స్పీడుగా సెట్ చేసుకొని వాడుతుంటారు. అయితే స్పీడ్ తగ్గిస్తే మేలు జరుగుతుందని, కరెంటు బిల్లు తగ్గుతుందని కొందరు అనుకుంటారు. ఇందుకోసం రెగ్యులేటర్‌ స్పీడును 5 నెంబరుకు బదులు 3, 4 నెంబర్లపై సెట్ చేస్తుంటారు. కానీ నిజానికి ఈ టెక్నిక్ పనిచేయదు. ఎందుకంటే వోల్టేజ్‌ను తగ్గించడం ద్వారా స్పీడ్‌ను కంట్రోల్ చేసే రెగ్యులేటర్ కలిగి ఉన్నప్పటికీ వినియోగదారులు కరెంటు వాడకాన్ని మాత్రం తగ్గించరు కదా. పైగా ఇక్కడ రెగ్యులేటర్ రెసిస్టర్‌గా పనిచేస్తుందని, వోల్టేజీని మాత్రమే తగ్గిస్తుందని నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల ఫ్యాన్ తక్కువ ఎనర్జీని యూజ్ చేసుకుంటుంది కానీ, తక్కువ కరెంట్ ఖర్చవుతుందనేది మాత్రం నిదజం కాదట. ఏసీ, కూలర్ల విషయంలోనూ ఇది వర్తిస్తుంది.

ఇటీవల ఫ్యాన్ వేగంతోపాటు విద్యుత్ వినియోగాన్ని నియంత్రించే రెగ్యులేటర్ల తయారీపై నిపుణులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే కొన్నిచోట్ల ఇవి అందుబాటులో ఉన్నప్పటికీ ధర ఎక్కువగా ఉండవచ్చునని చెప్తున్నారు. అయితే కరెంటు తక్కువగా ఖర్చవుతుంది అనేందుకు మాత్రం సరైన ఆధారాలు లేవు. సాధారణ రెగ్యులేటర్లకంటే ఎలక్ట్రానిక్ రెగ్యులేటర్లు కాస్త విద్యుత్ ఆదా చేయడంవల్ల కొంత ఖర్చు తగ్గవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.



Next Story

Most Viewed