- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తేనేటీగలు అంతరించిపోతే మానవ జాతికే ముప్పు..!
దిశ, ఫీచర్స్: మానవులు, మొక్కలు, జంతువులు పర్యావరణం మధ్య సమతుల్యతను కాపాడడంలో తేనెటీగలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. తేనెటీగలు లేకపోతే ఆహార కొరత ఏర్పడుతుంది. ఎందుకంటే ఇవి పరాగసంపర్కం ద్వారా వ్యవసాయ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. ప్రపంచంలో తేనెటీగలు అంతరించిపోతే ఆ తర్వాత మానవ జాతి కూడా కనుమరుగైపోతుంది. వాతావరణంలో మార్పులు, అడవుల నరికివేత, పురుగుమందులు, రసాయనాల వాడకం, వాయు కాలుష్యం కారణంగా తేనెటీగల సంఖ్య తగ్గిపోతుందని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ తెలిపింది. అంతేకాకుండా ఈ తరహాలోనే సీతాకోకచిలుకలు, హమ్మింగ్ బర్డ్ వంటి పరాగ సంపర్క జీవులకు ముప్పు ఎక్కువగా పొంచి ఉందని తెలియజేసింది.
తేనెటీగల ప్రాధాన్యత:
పరాగసంపర్కం కోసం మనుషులు తేనెటీగలను కాపాడుకోవాలి. అవి ప్రంపంచంలోనే అత్యుత్తమ పరాగ సంపర్క జీవులు. ఇవి అంతరించిపోతే, మొక్కలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అప్పుడు ఆహార ఉత్పత్తి క్రమంగా తగ్గుతుంది. ఇవి పువ్వులల్లోని పుప్పొడి, మకరందం రెండిటిని ఆహారంగా తీసుకుంటాయి. మరొక విషయం ఏంటంటే.. ఇవి ఎక్కువ సువాసనను వెదజల్లే మల్లె, గులాబీ వంటి పూల నుండి ఆహారం తీసుకోవు. మామిడి, పొద్దుతిరుగుడు పూలు, నువ్వులు, మునగ పూల వంటి వాటి నుండి ఎక్కువగా ఆహారం సేకరిస్తాయి. ఏ రుతువులో ఏ పూలు పూస్తాయనే విషయం కూడా వీటికి తెలిసిపోతుంది. ఇవి చాలా తెలివిగలవి. వాసనను పసిగట్టి, తమ ఆహారం ఎక్కడుందో తెలుసుకుంటాయి.
ఆహార ఉత్పత్తిలో కీలక పాత్ర:
పుప్పొడి రేణువులు ఒక పువ్వు నుంచి మరొక పువ్వు కీలాగ్రానికి పరిగా సంపర్కం జరుగుతుంది. దీని వల్ల పండ్లు, గింజలు తయారవుతాయి. తేనెటీగలు, సీతాకోకచిలుకల వల్లే 80 శాతం మొక్కల పరాగ సంపర్కం జరుగుందని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో వెల్లడించింది. అంతేకాకుండా ప్రపంచంలోని మొత్తం వ్యవసాయ భూమిలో 35శాతం లేదా మానవ ఆహారంలో మూడింట ఒక వంతు తేనెటీగల పాత్ర ప్రధానంగా ఉంటుందని తెలిపింది. ఇవి లేకపోతే కూరగాయలు, నూనె గింజలు, బాదం, వాల్‌నట్స్, కాఫీ, టమాట, యాపిల్ వంటి తదితర మొక్కల పరాగ సంపర్కం దెబ్బతింటుంది. ఇది మానవ ఆహారంలో పోషకాహార లోపానికి దారితీస్తుందని నివేదికలో పేర్కొంది.
వాతావరణ మార్పులు:
వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగి తేనెటీగల జీవక్రియ రేటు కూడా పెరుగుతుంది. దీని వల్ల ఆహార సేకరణకు సాధారణంగా కంటే ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తాయి. పొద్దుతిరుగుడు మొక్క పరాగ సంపర్కంలో తేనెటీగలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి వికసించే సమయంలో పరాగ సంపర్కం జరిగితే, అధిక దిగుబడి వస్తుంది. అలాగే వాతారణంలోని మార్పులు పూల ఉత్పత్తిని కూడా ప్రభావితం చేస్తాయి. కాలంతో సంబంధం లేకుండా పూల మొక్కలు ముందుగా పూస్తే, వాటి నుంచి ఆహారంను సేకరించుకోలేవు.
గత ఏడాది తమిళనాడులో తెన్‌కాశీ అనే జిల్లాలో 500 ఎకరాల్లో పొద్దుతిరుగుడు సాగు చేశారు. కానీ, అక్కడ తేనెటీగల సంఖ్య బాగా తగ్గిపోవడంతో.. అక్కడి వ్యవసాయ శాఖ రైతులకు కృత్రిమ పరాగ సంపర్కానికి సంబంధించిన పద్ధతులను నేర్పించి, వాటిని అమలు చేశారు. కానీ, ఇలా చేయడం వల్ల పంట దిగుబడి, నాణ్యతతో పాటుగా పోషకాలు కూడా తగ్గుతాయి. అదేవిధంగా జీవవైవిధ్యానికి సరిపడా పోషకాలు అందించలేవు. వీటిలో ఎక్కువగా అడవి తేనెటీగల రకాలు ఎక్కువడా ఉంటాయి. అడవులు, చెట్లు, నాశనమైతే వీటి ఆహార సేకరణ ప్రదేశాలు కూడా నాశనం అవుతాయి. అందుకే మొక్కలు, చెట్లు, అడవులను రక్షించుకోవాలి.