- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
9000 మైళ్ల దూరంలో ఉన్నా.. ఒకే పాటతో కనెక్ట్ అవుతున్న తిమింగలాలు
దిశ, ఫీచర్స్ : క్షీరదాల్లో తిమింగలాలను అత్యంత తెలివైనవిగా భావిస్తుంటారు. ఇదే మాటను రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్ ప్రచురించిన అధ్యయనం మరోసారి నిర్ధారించింది. హంప్‌బ్యాక్ తిమింగలాలు దాదాపు 8000 కిలోమీటర్ల మేర సముద్ర ప్రాంతంలో పాటల ద్వారా సహచరులతో కమ్యూనికేట్ అవుతాయని వెల్లడించింది. తూర్పు ఆస్ట్రేలియా తీరంలో హంప్‌బ్యాక్ తిమింగలాల నుంచి వినిపించిన పాటలను రికార్డ్ చేసిన ఈక్వెడార్‌కు చెందిన పరిశోధకుల బృందం.. ఈ థీమ్స్ దక్షిణ పసిఫిక్ అంతటా కొనసాగుతున్నాయని తెలిపింది.
ఈ మేరకు సగం భూగోళం ఇప్పుడు తిమింగలాల కోసం ప్రత్యేక స్వరంతో అనుసంధానించబడి ఉందని అధ్యయన రచయిత, సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీలో సముద్ర జీవశాస్త్రవేత్త ఎల్లెన్ గార్లాండ్ వెల్లడించారు. మేల్ హంప్‌బ్యాక్ తిమింగలాలు సంతానోత్పత్తి కాలంలో జాజ్ తరహా మేటింగ్ సాంగ్స్‌ను హమ్ చేస్తాయి. అయితే ఈ తిమింగలాలు పాడే పాటలు కాలక్రమేణా మారవచ్చు. ఈ మార్పును పరిశోధకులు 'ప్రగతిశీల సాంస్కృతిక పరిణామం, సాంస్కృతిక విప్లవం' అనే రెండు విభిన్న దృగ్విషయాలుగా ఆపాదించారు.
మొదటి వర్గంలో పాటలు ప్రాథమిక పరిణామ ప్రక్రియను అనుసరిస్తాయి. ఇందులో వివిధ తిమింగలాలు పాటలోని యూనిట్లు, పదబంధాలను తొలగిస్తాయి లేదా జోడిస్తాయి. పాట రిపిటేషన్స్‌లో చిన్న మార్పులు నెమ్మదిగా పూర్తిగా భిన్నమైన సంస్కరణకు దారితీసి వాటి కమ్యూనిటీలో వ్యాపిస్తుంది. రెండో వర్గంలో పొరుగు జనాభా కొత్త పాటతో ముందుకొస్తుంది. అప్పటికే ఉన్న తిమింగలం జనాభా దానిని త్వరగా ల్యాప్ చేస్తుంది. స్థానిక తిమింగలాలతో పోలిస్తే.. ఆస్ట్రేలియా తూర్పు తీరంలోని ఒక మేల్ వేల్ పూర్తిగా భిన్నమైన పాటను పాడటాన్ని పరిశోధకులు ఉదాహరణగా పేర్కొన్నారు. అయితే ఇది పశ్చిమ తీరంలో పాడిన పాటకు మ్యాచ్ అయింది.
రెండేళ్లలో తూర్పు తీరంలోని మేల్ తిమింగలాలు అన్నీ ఒకే పాటను పాడటం ప్రారంభించాయి. ఇది తిమింగలాల మధ్య సాంస్కృతిక విప్లవం గతంలో అనుకున్నదానికంటే చాలా వేగంగా ఉందని సూచిస్తోంది. పొరుగున ఉన్న తిమింగలాలు ఒకదానికొకటి శబ్ద పరిధిలోకి వెళ్లినప్పుడు ఈ పాటలు ప్రయాణించాయని రచయిత తెలిపాడు. తిమింగలాలు తమ సంతానోత్పత్తి ప్రదేశాలను విడిచిపెట్టి, ఆహారాన్ని కనుగొనే ప్రదేశాలకు వలసపోతున్నప్పుడు ఇది సాధారణంగా జరుగుతుంది. అయితే పాటలు దేనికి సంకేతమనే విషయంలో స్పష్టత లేదు. ఫిమేల్స్‌తో సంభోగం కోసమా? రెండు మేల్స్ మధ్య ఇంటరాక్షన్ కోసమా? లేదంటే బహుళ సంకేతమా అనేది మిస్టరీగానే ఉంది.