AP Govt.: కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం.. కేబినెట్ హోదా ఉన్న వారికి ఇక పండగే

by Shiva |
AP Govt.: కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం.. కేబినెట్ హోదా ఉన్న వారికి ఇక పండగే
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తూ.. పాలనలో శరవేగంగా దూసుకెళ్తోన్న కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి కేబినెట్ హోదా (Cabinet Designation)లో కొనసాగుతోన్న వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారి జీతభత్యాలను పెంచనున్నారు. కేబినెట్ ర్యాంక్ ఉన్న వారికి ఫిబ్రవరి నుంచి రూ.2 లక్షల వేతనం ప్రభుత్వం నుంచి అందనుంది. శాలరీతో పాటు కార్యాలయ ఫర్నిచర్ (Furniture) ఏర్పాటుకు వన్ టైం గ్రాంట్ (One Time Grant)ను విడుదల చేయనుంది. అదేవిధంగా వ్యక్తిగత సహాయ సిబ్బందిని నియయమించుకునేందుకు అలవెన్స్ (Allowance) ఇతర సౌకర్యాల కోసం మరో రూ.2.50 లక్షలు చెల్లించేందుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామంతో కేబినెట్ ర్యాంక్‌ (Cabinet Rank)లో కొనసాగుతోన్న వారికి నెలకు మొత్తం 4.50 లక్షలు అందబోతున్నాయి. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కేబినెట్ హోదాలో ఉన్న వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed