వైసీపీ సహా ఏపీ ఎంపీలంతా ఆ పార్టీకే మద్దతు: షర్మిల సెన్సేషనల్ కామెంట్స్

by srinivas |   ( Updated:2025-01-11 07:14:30.0  )
వైసీపీ సహా  ఏపీ ఎంపీలంతా ఆ పార్టీకే మద్దతు: షర్మిల సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో బీజేపీ ఎక్కడో లేదని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(Deputy Cm Pawan Kalyan)లోనే ఉందని రాష్ట్ర కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల(Congress PCC chief Sharmila) వ్యాఖ్యానించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌(Doctor Br Ambedkar)పై అమిషా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా విజయవాడ(Vijayawada)లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రానికి చెందిన ఎంపీలందరూ బీజేపీకి మద్దతు పలుకుతున్నారని చెప్పారు. చివరకు వైసీపీ కూడా బీజేపీవైపు ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా బీజేపీకి ఎందుకు మద్దతిస్తున్నారని షర్మిల మండిపడ్డారు.

హోంమంత్రిగా ఉండి అమిత్ షా పార్లమెంట్‌లోనే అంబేద్కర్‌ను అవమానించడం బాధాకరమని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ మతతత్వ పార్టీ అని విమర్శించారు. మతం, కులం పేరుతో రాజకీయాలు చేస్తోందని, ఇందులో చాలా మందిని బలి తీసుకుందన్నారు. దేశ సంపదను అదానీ లాంటి వ్యాపారవేత్తలకు దోచిపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ బీజేపీ తమ గుప్పెట్లో పెట్టుకుందని ఆరోపించారు. దేశాన్ని కాషాయమంగా మార్చేందుకు బీజేపీ పూనుకుందని తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధులను కూడా దేశ ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గాంధీని చంపిన వారికి కూడా గుడులు కడుతున్నారని మండిపడ్డారు.



Next Story

Most Viewed