Joe Biden: నేను పోటీలో ఉంటే ట్రంప్ ని ఓడించేవాడ్ని- జోబైడెన్

by Shamantha N |
Joe Biden: నేను పోటీలో ఉంటే ట్రంప్ ని ఓడించేవాడ్ని- జోబైడెన్
X

దిశ, నేషనల్ బ్యూరో: ‘నేను ఎన్నికల బరిలో ఉంటే కచ్చితంగా ట్రంప్(Donald Trump)ని ఓడించేవాడ్ని’ అని అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడన్(Joe Biden) అన్నారు. ఎన్నికల్లో తిరిగి పోటీ చేయకూడదనేది తప్పుడు నిర్ణయమా?.. దానివల్లే ట్రంప్‌ మళ్లీ అధ్యక్షుడు కావడానికి సహాయపడిందని అనుకుంటున్నారా? అని మీడియా బైడెన్ ని ప్రశ్నించింది. అయితే తాను అలా అనుకోవట్లేదని.. కాకాపోతే పోటీ చేసి ఉంటే బైడెన్ ను కచ్చితంగా ఓడించేవాడ్ని అని విశ్వాసం వ్యక్తం చేశారు. కమలా హ్యారిస్‌ (Kamala Harris) ఎన్నికల్లో ట్రంప్‌ను ఓడించగలదని తాను భావించానని అందువల్లే మద్దతిచ్చానని అన్నారు. దానికి తగ్గట్లే కమలా హ్యారిస్ కృషి చేసిందన్నారు. ట్రంప్‌ను ఆమె ఓడించగలదని ఇప్పటికీ తాను నమ్ముతున్నానని బైడెన్‌ అన్నారు. అయితే, డెమోక్రటిక్‌ పార్టీలో ఐక్యత కోసమే తాను పోటీ నుంచి తప్పుకున్నట్లు బైడెన్ పేర్కొన్నారు.

పోటీ నుంచి తప్పుకున్న బైడెన్

ఇకపోతే, అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో నిలబడిన జో బైడెన్‌కు సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంకో, ఆరోగ్య సమస్యల కారణంగా అధ్యక్ష రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హ్యారిస్ కు తన మద్దతు ప్రకటించారు. పదవుల కన్నా ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే ముఖ్యమని, అందుకే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు బైడెన్ అప్పట్లో చెప్పుకొచ్చారు. నియంతల కన్నా దేశం గొప్పదని వ్యాఖ్యానించారు. ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్ సమర్థురాలంటూ ప్రశంసించారు. నవంబర్‌ 5న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ చేతిలో కమలా హారిస్‌ ఓడిపోయారు. త్వరలోనే ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.



Next Story