- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Garam Masala : ఇంట్లోనే చికెన్ మసాలా, మటన్ మసాలా ఎలా తయారు చేసుకోవాలి?
by Sujitha Rachapalli |
X
దిశ, ఫీచర్స్: సండే వచ్చిందంటే చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. నాలుక మాంసం రుచి కోసం తహతహలాడుతుంది. అది కూడా ఘాటు ఘాటుగా మాంచి మసాలా దట్టించి చేసుకోవాలా... తింటుంటే కళ్ల నుంచి నీళ్లు బయటకు రావాలా. అలా ఉండాలి అంటే కూరల్లో గరం మసాలా దట్టించాల్సిందే. చికెన్ అయినా, మటన్ అయినా మస్ట్ గా వాడాల్సిందే. అయితే చాలా మంది మార్కెట్ లో దొరికే మాసాలాలకు అలవాటు పడిపోయారు. దీనివల్ల సరిగ్గా మాంసం రుచిని ఆస్వాదించలేకపోతున్నారు. అలా కాకుండా ఇంట్లోనే మసాలా తయారు చేసుకొని.. చక్కగా ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చని అంటున్న ఫుడ్ లవర్స్.. ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తున్నారు.
- ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని మీడియం మీద పెట్టి పాన్ వేడి చేయాలి. రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర, టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు, నాలుగు యాలకులు, 10 లవంగాలు, రెండు దాల్చిన చెక్కలు, మూడు బగారా ఆకులను తీసుకుని పాన్ పై వేయించాలి.
- వాటిని నుంచి సుగంధం వచ్చే వరకు వేయించి.. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని చల్లబడనివ్వాలి. సుగంధ ద్రవ్యాల రుచి, వాసన నిలుపుకునేందుకు ఇది చాలా ముఖ్యం.
- ఇవి పూర్తిగా చల్లబడ్డాక మెత్తగా పొడి చేసుకుని.. వీటికి ఒక టీ స్పూన్ అల్లం పొడి, అర టీ స్పూన్ జాజికాయ యాడ్ చేసి మళ్లీ మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు గరం మసాలా రెడీ అయిపోయినట్లే.
- కాగా తాజాగా గ్రైండ్ చేసిన ఈ పొడిని గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ చేయడం మంచిది. కాగా ఉత్తమ రుచి, వాసన కోసం ఈ పౌడర్ ను ఆరు నెలల్లోపే వాడాలి.
Advertisement
Next Story