Parivrtta Parsvakonasana ఎలా చేయాలి? ప్రయోజనాలేంటి?

by sudharani |   ( Updated:2022-09-19 06:45:27.0  )
Parivrtta Parsvakonasana ఎలా చేయాలి? ప్రయోజనాలేంటి?
X

పరివృత్త బద్ధ పార్శ్వకోనాసనం : మొదట బల్లపరుపు నేలపై నిలబడి రిలాక్స్ అవ్వాలి. తర్వాత రెండు మోకాళ్లను వంచి గోడకుర్చీ ఆకారంలో కూర్చోవాలి. ఇప్పుడు ఎడమకాలిని ఎడమవైపు నిటారుగా చాపి.. కుడికాలి పాదాన్ని కుడివైపు తిప్పాలి. అలాగే పూర్తి శరీరాన్ని కుడి తొడపై ఆన్చి.. ఎడమ చేతిని వీపు వెనక నుంచి, కుడిచేతిని కుడి మోకాలి కింద నుంచి తీసుకెళ్లి రెండు చేతులను జతచేయాలి. రెండు చేతి వేళ్లను పెనవేసిన తర్వాత తలను ఎడమవైపు తిప్పి ఆకాశాన్ని చూడాలి. ఈ భంగిమలో వెన్నుముక, ఎడమకాలు నిటారుగా ఉండేలా చూసుకోవాలి.

ప్రయోజనాలు:

* చీలమండలాలను బలోపేతం చేస్తుంది.

* మలబద్ధకం నుంచి ఉపశమనం.

* నడుము నొప్పికి మంచి వ్యాయమం.

* సయాటికా ఉన్నవారికి ఎంతో మేలు.

Advertisement

Next Story

Most Viewed