- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- క్రైమ్
- ఎడిట్ పేజీ
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- జిల్లా వార్తలు
- భక్తి
భుజ పిడాసనం (Bhujapidasana) ఎలా చేయాలి.. ప్రయోజనాలేంటి?

X
దిశ, ఫీచర్స్: మొదటగా బల్లపరుపు నేలపై రిలాక్స్ పొజిషన్‌లో కూర్చోవాలి. తర్వాత రెండు మోకాళ్లను మడిచి పాదాలను పిరుదులకు దగ్గరగా పెట్టాలి. ఇప్పుడు రెండు చేతులను రెండు మోకాళ్ల కింద నుంచి తీసుకెళ్లి అరచేతులను నేలపై సమాంతరంగా ఆన్చాలి. తర్వాత శరీర బ్యాలెన్స్ మొత్తం రెండు చేతులపై వేస్తూ పిరుదులను పెకెత్తాలి. ఈ భంగిమలో రెండు కాళ్లు మోచేతులపైనే ఉండాలి. బాడీ మొత్తం గాలీలో ఉంచి చేతులను బెండ్ చేయకుండా సాధ్యమైనంత సేపు ఆపాలి. అధిక బరువున్న వ్యక్తులు ఇతరుల సాయం తీసుకుంటే మేలు.
ప్రయోజనాలు :
* భుజాలు, మణికట్టు, చేతులకు బలాన్నిస్తుంది.
* కోర్ కండరాలను సాగదీసి ఉత్తేజితపరుస్తుంది.
* బ్యాలెన్స్ మెరుగుపరచడంలో సాయం.
* హిప్ కీళ్లలో వశ్యతను పెంచుతుంది.
Next Story