- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లికి ఇన్సూరెన్స్.. రూ.10 లక్షల కవరేజీ.. పరిహారం ఎలా ఇస్తారంటే ?
దిశ, ఫీచర్స్ : భవిష్యత్తులో మన ఆరోగ్యానికి, ఆస్తులకి, వ్యాపారాలకి ఏం నష్టం వస్తుందో ఊహించటం చాలా కష్టం. మనకు, మన కుటుంబానికి నష్టం కలిగే అవకాశం నుండి రక్షణ పొందడానికి బీమా చేయించుకుంటాం. ఇంకో విధంగా చెప్పాలంటే అనుకోని విపత్తులకు బీమా సంస్థ అందజేసే ధన సహాయమే బీమా. ఆస్తిని, ఆరోగ్యాన్ని, జీవితాన్ని, ఇలా దేన్నయినా బీమా చేయవచ్చు. ఈ క్రమంలోనే కొన్ని బీమా కంపెనీలు పెళ్లికి కూడా బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వివాహం కుదిరి పీటల మీద పెళ్లి ఆగిపోయినా, వరదలు, తుపాన్లు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలతో పెళ్లి మండపం పాడైతే ఫ్యూచర్ వివాహ్ సురక్షా పాలసీ ద్వారా బీమా క్లైమ్ అవుతుంది. అలాగే వరుడు లేదా వధువు కుటుంబ సభ్యులకు ప్రమాదం జరిగినా బీమా కవరేజీ ఉంటుంది. అలాగే అనుకోని సంఘటనలు, ప్రకృతి వైపరిత్యాలు జరిగినా వెడ్డింగ్ ఇన్సూరెన్స్ క్లైం అవుతుంది.
రూ.10 లక్షల వరకు కవరేజీ..
ఈ పాలసీ పెండ్లి సమయంలో జరిగే ప్రమాదాలకు మాత్రమే వర్తిస్తుందని బీమా కంపెనీ చెబుతుంది. పాలసీ ప్రీమియం, కవరేజీ ఎలాంటి సందర్భాల్లో అవుతుంది, బీమా ప్రీమియం మీద ఆధారపడి ఉంటుంది. రూ.10 లక్షల వెడ్డింగ్ ఇన్సూరెన్స్ పాలసీని చేసుకుంటే రూ.7500 నుండి రూ.15 వేలు ప్రీమియంని చెల్లించాల్సి వస్తుంది.
వెడ్డింగ్ ఇన్సూరెన్స్‌లో మినహాయింపులు
వెడ్డింగ్ ఇన్సూరెన్స్‌లో కూడా కొన్ని మినహాయింపులు ఉన్నాయి. పాలసీని కట్టేముందు చెప్పిన ప్రీ ఎగ్జిస్టింగ్ కారణంగా వివాహం ఆగితే పాలసీ వర్తించదు. చట్టపరమైన సమస్యలు, కుటుంబ తగాదాలతో వివాహం రద్దయితే కవరేజీ జరగదు.