- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Tonsillitis : మాన్‌సూన్‌లో టాన్సిల్స్ తీవ్రతరం
దిశ, ఫీచర్స్: గొంతు నొప్పి, గొంతులో మంట, మింగడంలో నొప్పి ఒక సాధారణ సమస్య. ఇది ప్రత్యేకంగా కాలానుగుణంగా రాకపోయినప్పటికీ.. వర్షాకాలం టాన్సిల్స్‌ను మరింత తీవ్రతరం చేస్తుంది. వాతావరణంలో మార్పు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో సహా వివిధ అనారోగ్యాల పెరుగుదలకు కూడా దారి తీస్తుంది. టాన్సిల్స్ వాపు ద్వారా ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే టాన్సిలిటిస్ ఇందులో ఒకటి. కాగా ఇంతకీ వర్షాకాలం గవదబిళ్లలను ఏ విధంగా తీవ్రతరం చేస్తుంది? ఎలాంటి టిప్స్ పాటిస్తే నివారణ సులభతరం అవుతుంది? చూద్దాం.
టాన్సిలిటిస్ అనేది టాన్సిల్స్ వాపును సూచిస్తుంది. అంటే గొంతు వెనుక భాగంలో ఉన్న రెండు చిన్న కణజాలాలు ఇన్‌ఫ్లమేషన్‌కు గురవుతాయి. టాన్సిల్స్ ప్రాథమిక విధి శ్వాసకోశ వ్యవస్థలోకి వ్యాధికారక ప్రవేశాన్ని నిరోధించడం. కానీ అవి కూడా ఇన్ఫెక్షన్లకు గురవుతాయి. వైరల్, బాక్టీరియల్ వ్యాధికారకాలు రెండింటి వల్ల టాన్సిలిటిస్ సంభవించే అవకాశం ఉండగా.. స్ట్రెప్టోకోకస్ పియోజెనెస్, స్ట్రెప్ థ్రోట్‌కు కారణమయ్యే బ్యాక్టీరియం తరచుగా ఇందుకు కారణమవుతుంది.
వర్షాకాలంలో ఎందుకు అధ్వాన్నంగా మారుతుంది?
వర్షాకాలం వివిధ వ్యాధికారక క్రిముల పెరుగుదల, వ్యాప్తికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. పెరిగిన తేమ స్థాయిలు, హెచ్చుతగ్గుల ఉష్ణోగ్రతలు.. బ్యాక్టీరియా, వైరస్‌లకు అనువైన సంతానోత్పత్తి స్థలాన్ని సృష్టిస్తాయి. అంతేకాకుండా వర్షాకాలంలో, వివిధ ప్రదేశాలలో నీరు నిలిచిపోతుంది. ఇది డెంగ్యూ, మలేరియా వంటి అంటు వ్యాధుల వాహకాలు, దోమలకు ఆవాసాలను అందిస్తుంది. ఈ కారకాలు ఈ సీజన్‌లో టాన్సిలిటిస్‌తో సహా శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌లకు దోహదం చేస్తాయి. కాబట్టి ఈ కలుషితమైన వర్షపు నీటిని త్రాగడం లేదా పీల్చడం వలన ఈ పరిస్థితి తలెత్తే ప్రమాదం పెరుగుతుంది.
మాన్‌సూన్‌లో టాన్సిల్స్ నివారణ ఎలా?
* వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. ముఖ్యంగా భోజనానికి ముందు, కలుషితమైన స్థలం లేదా వస్తువులను ముట్టుకున్న తర్వాత సబ్బు, నీటితో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోండి.
* రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే టాన్సిలిటిస్ సోకిన వ్యక్తులతో కాంటాక్ట్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి మనకు ఈ అంటువ్యాధి సంక్రమించే చాన్స్ ఉండదు.
* బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి. గొంతును తేమగా ఉంచడానికి, ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థను నిర్వహించడానికి శుభ్రమైన, ఫిల్టర్ చేసిన నీటిని పుష్కలంగా తీసుకోవాలి.
* దోమల వికర్షకాలను ఉపయోగించడం బెటర్. దోమ కాటును నివారించడానికి దోమ తెరలు లేదా మస్కిటో రిపల్షన్స్ వంటి రక్షణ చర్యలను ఉపయోగించండి.
* సొంత మెడికేషన్‌తో మొదటికే మోసం కావచ్చు. గొంతు నొప్పి, జ్వరం లేదా మింగడంలో ఇబ్బంది వంటి టాన్సిలిటిస్ లక్షణాలు అనుభవిస్తే తగిన చికిత్స కోసం వైద్య నిపుణుడిని సంప్రదించండి.
* గార్గిలింగ్‌తో కాస్త ఉపశమనం కలగొచ్చు. గోరువెచ్చని సెలైన్ గార్గిల్స్ గొంతుకు ఉపశమనం కలిగించడం ద్వారా తాత్కాలికంగా నొప్పి నుంచి బయటపడుతారు.
* త్వరతగతిన కోలుకోవడానికి తగినంత విశ్రాంతి తీసుకోవడం, హైడ్రేట్‌గా ఉండటానికి ద్రవాలను తీసుకోవడం చాలా అవసరం.
వర్షాకాలం మరియు టాన్సిలిటిస్.. ఈ సమయంలో వ్యాధికారకాల పెరుగుదల, కనెక్షన్ కోసం సృష్టించబడిన అనుకూలమైన పరిస్థితుల కారణంగా సంబంధాన్ని పంచుకుంటాయి. లక్షణాల విషయంలో తగిన చికిత్స కోసం వైద్య సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. సరైన నిర్వహణ, సంరక్షణతో వ్యక్తులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వర్షాకాలాన్ని ఎంజాయ్ చేయొచ్చు.