గర్భిణీలు ధానిమ్మ తినడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో?

by samatah |   ( Updated:2023-08-16 14:37:20.0  )
గర్భిణీలు ధానిమ్మ తినడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో?
X

దిశ, వెబ్‌డెస్క్ : తల్లికావడం అనేది ప్రతీ స్త్రీకి మధురమైన జ్ఞాపకం లాంటిది. అయితే ఈ సమయంలో మహిళలు చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. అందువలన తల్లికాబోయే మహిళ ఆరోగ్యకరమైన పండ్లు తినాలి అంటారు వైద్యులు.

ముఖ్యంగా గర్భిణీలు పోషకాలు మెండుగా ఉండే ధానిమ్మను తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. ధానిమ్మలో పొటాషియం, క్యాల్షియం లాంటి మినరల్స్‌తో పాటు ఫైబర్‌ తగినంత మొత్తంలో ఉంటుంది. అలాగే విటమిన్‌-సి, కె, బి, ఎ పుష్కలంగా ఉంటాయి.గర్భం దాల్చిన మొదటి త్రైమాసికం నుంచే.. దానిమ్మను డైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేర్చుకుంటే తల్లి, బిడ్డ ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

  • గర్భధారణ సమయంలో చాలా మంది రక్తహీనతతో బాధపడుతుంటారు. అలాంటి వారికి ధానిమ్మ చాలా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సీ ఎక్కువగా ఉండటం వలన శరీరం ఐరన్‌ను గ్రహించడానికి తోడ్పడుతుంది.
  • దానిమ్మలో కాల్షియం మెండుగా ఉంటుంది. ఇది గర్భిణీ స్త్రీల ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది.
  • పోషకాహార లోపం కారణంగా.. ప్రీమెచ్యూర్‌ డెలివరీ అయ్యే ప్రమాదం ఉంది. కొంతమంది మహిళలకు మాయలోనూ సమస్యలు కలగవచ్చు. దీని వల్ల బిడ్డ నెలలు నిండకుండానే పుట్టడం, బరువు తక్కువగా పుట్టే అవకాశం ఉంది. దానిమ్మ యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్‌. ఈ సమస్యలను పరిష్కరించడానికి దానిమ్మలోని యాంటీఆక్సిడెంట్స్‌ సహాయపడతాయి.

Read More: ఆకలిని పెంచే ఈ సూపర్ ఫుడ్ గురించి తెలుసా?

Advertisement

Next Story