Gotra: గోత్రం ఎలా పుట్టింది .. ఒకే గోత్రం ఉన్నవారు పెళ్లి చేసుకోవచ్చా..?

by Prasanna |
Gotra: గోత్రం ఎలా పుట్టింది .. ఒకే గోత్రం ఉన్నవారు పెళ్లి చేసుకోవచ్చా..?
X

దిశ,ఫీచర్స్: హిందువులలో పుట్టిన ప్రతి ఒక్కరికి గోత్రం ఉంటుంది. అలాగే ప్రతి కులానికి వారికి సంబందించిన గోత్రం ఉంటుంది. అసలు ఈ గోత్రమనేది ఎలా వచ్చిందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

గోత్రం ఎలా పుట్టింది?

పూర్వకాలంలో విద్యను నేర్పించడానికి కొన్ని కుటుంబాలకు ఒక గురువు ఉండే వాళ్లు. ఆ కుటుంబాలకు గురువు పేరు గోత్రంగా ఉండేది. విద్యను అభ్యసించువారు వారి గురువుల గోత్రంగా చేసుకునే వారు. ఆ విధంగా ప్రతి కుటుంబానికి గోత్రం ఏర్పడింది.

ఒకే గోత్రం ఉన్నవారు పెళ్లి చేసుకోవచ్చా..?

ఒకే గోత్రం ఉన్నవారు పెళ్లి చేసుకోవడానికి హిందూ శాస్త్రం ఒప్పుకోదు. ఎందుకంటే వరుసకి అన్నా చెల్లెలు అవుతారని శాస్త్రం చెబుతోంది. పరిచయం లేకున్నా.. ఒకే గోత్రం ఉన్నప్పుడు.. ఎక్కడో ఒకచోట రక్త సంబంధం కలుస్తుంది. అందువల్ల అయినా గోత్రాలు కలిసినప్పుడు కొన్ని సంవత్సరాల కిత్రం అయినా, వారికి కూడా రక్త సంబంధం ఉండే ఉంటుంది. అందుకే ఒకే గోత్రం ఉన్నవారు పెళ్లిళ్లు చేసుకోకకూడదని హిందూ శాస్త్రం,మన పెద్దలు చెబుతున్నారు.అంతేకాకుండా ఒకే గోత్రంలో వివాహం చేసుకుంటే సంతానం విషయంలో సమస్యలు ఏర్పడతాయి.

Next Story

Most Viewed