- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రెగ్నెన్సీని ప్రభావితం చేస్తున్న ఎయిర్ పొల్యూషన్
దిశ, ఫీచర్స్ : ప్రపంచవ్యాప్తంగా 9 మిలియన్ మరణాలకు వాయు కాలుష్యమే కారణం. ఇలాంటి కలుషిత వాతావరణం భూమిపై నివసిస్తున్న మనుషులతో పాటు పుట్టబోయే పిల్లల ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతోంది. తల్లి గర్భంలో ఉండే పిల్లల శరీరాలు, మెదడు అభివృద్ధి చెందే దశలో చాలా సున్నితంగా ఉంటాయి. కాబట్టి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. కాగా గాలిలోని రసాయనాలు, కణాలు గర్భిణుల్లో మానవ శరీరానికి హాని కలిగిస్తాయి.
శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల ద్వారా సంభవించే అన్ని మరణాల్లో దాదాపు పదింటిలో ఒక మరణానికి మూలం వాయి కాలుష్యం. ఇంస్ట్రియల్ స్మోక్, ధూమపానం, బహిరంగ దహనం, కలప లేదా ఇతర జీవ వనరులతో వంట చేయడం, రహదారి & వాహన ఉద్గారాలతో కూడిన పట్టణ కాలుష్యం వల్ల ఆస్తమా, పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు సంభవించవచ్చు. అయితే శుభ్రమైన గ్యాస్ స్టవ్‌లను ఉపయోగించడం, గ్యార్బేజ్ డిస్పోజల్‌కు ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ కనుగొనడం, ధూమపానాన్ని విడిచిపెట్టడంలో ఒకరికొకరు సాయం చేసుకోవడం వంటి చర్యలతో ఆసియాలో ఆరు లక్షల మంది పిల్లల మరణాలను, 7% వరకు గర్భధారణ నష్టాలను నిరోధించవచ్చు.
గర్భిణుల్లో వాయు కాలుష్య ప్రభావాలు :
* తక్కువ జనన బరువు :
వాయు కాలుష్యానికి గురైనవారి పిల్లలు తక్కువ బరువుతో పుట్టే అవకాశం ఉంది. వాస్తవానికి నవజాత శిశువు తొమ్మిది పౌండ్ల బరువు ఉండాలి. కాగా 5-8 పౌండ్ల కంటే తక్కువున్న పిల్లలను 'లో బర్త్ వెయిట్'గా పరిగణిస్తారు.
* ప్రీ-టర్మ్ జననం లేదా మరణం :
ముందస్తు ప్రసవం వల్ల శిశువులో ఊపిరితిత్తులతో పాటు చిన్న మెదడు సరిగా అభివృద్ధి చెందదు. ఇది పుట్టిన సమయంలో లేదా కొంతకాలం తర్వాత శిశువులో మరణ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.
* రక్తపోటు :
తల్లి గర్భంలో ఉన్నప్పటికీ వాయు కాలుష్యం.. రక్తపోటు సంబంధిత సమస్యల ద్వారా పుట్టబోయే బిడ్డతో పాటు తల్లి ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.
* గర్భస్రావం :
బాహ్య వాయు కాలుష్యం స్త్రీ పురుషుల్లో తక్కువ సంతానోత్పత్తి రేటు కలిగిస్తుంది. ఇది మహిళలకు గర్భం దాల్చడాన్ని కష్టతరం చేస్తుంది. వాస్తవానికి వాయు కాలుష్యం కూడా గర్భస్రావం అవకాశాలను పెంచుతుంది.
ఎలా రక్షణ పొందాలి?
ఎయిర్ ప్యూరిఫైయర్‌ను ఏర్పాటు చేసుకోవడం వల్ల వంట గ్యాస్ లేదా హోమ్ రిఫ్రెషర్ నుంచి వెలువడే పొగతో పాటు గాలిలోని జెర్మ్స్ తొలగించడంలో సాయపడుతుంది. ఇండోర్ మొక్కలు కూడా గాలి సహజ శుద్ధీకరణకు తోడ్పడతాయి. అంతేకాదు ఇంటి నుంచి బయటకు వెళ్లేటపుడు పరిసరాల్లోని వాయు కాలుష్య స్థాయిలను తనిఖీ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.