స్ట్రేంజర్స్‌తో చాటింగ్‌తో బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్.. ఎలా అంటారా..?

by Sujitha Rachapalli |   ( Updated:2024-04-13 12:35:46.0  )
స్ట్రేంజర్స్‌తో చాటింగ్‌తో బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్.. ఎలా అంటారా..?
X

దిశ, ఫీచర్స్ : మనుషులు సంఘ జీవులు. ఇతరులతో మాట్లాడటాన్ని ఇష్టపడుతారు. మనసులోని విషయాలను పంచుకుని భారాన్ని దింపేసుకుంటారు. అయితే ఈ సోషల్ ఇంటరాక్షన్స్‌ వల్ల మనం అనుకున్న దాని కంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయని తాజా అధ్యయనం చెప్తుంది. ముఖ్యంగా స్ట్రేంజర్స్‌తో చాటింగ్ బెటర్ హెల్త్ సీక్రెట్ అని సూచిస్తుంది.

భార్య లేదా భర్త, స్నేహితులు, కుటుంబ సభ్యులతో స్ట్రాంగ్ కనెక్షన్స్ ఎక్కువ కాలం జీవించేందుకు కారణం అవుతున్నాయని ఇప్పటికే పలు అధ్యయనాలు రుజువు చేశాయి. అయితే ఫిన్‌లాండ్‌లో జరిపిన అధ్యయనంలో పరిచయస్తులతోపాటు స్ట్రేంజర్స్‌తో తరుచుగా మాట్లాడేవారు స్మాల్ సర్కిల్ కలిగిన వారికంటే 28శాతం ఎక్కువ కాలం జీవిస్తున్నారని తేలింది. క్యాంపస్‌, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, కేఫ్స్ వంటి బహిరంగ ప్రదేశాల్లో పరిచయం లేని వ్యక్తులతో మాట్లాడే మాటలు చాలా ఆనందాన్ని ఇస్తున్నాయని గుర్తించింది. అయితే స్మార్ట్ ఫోన్ ఇతరులతో కన్వర్జేషన్స్ తగ్గేందుకు కారణమైందంటున్న స్టడీ.. సోషల్ ఇంటరాక్షన్స్‌ లేకుండా చేస్తున్న సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ యాంగ్జయిటీ, డిప్రెషన్ లాంటి మెంటల్ హెల్త్ కండిషన్స్‌కు దారితీస్తున్నాయని హెచ్చరించింది.

Advertisement

Next Story

Most Viewed