Hormonal Imbalance: హార్మోన్లను ఈ విధంగా గాడిలో పెట్టొచ్చు!

by Prasanna |
Hormonal Imbalance: హార్మోన్లను ఈ  విధంగా గాడిలో పెట్టొచ్చు!
X

దిశ,వెబ్ డెస్క్: మనలో చాలా మంది హార్మోన్ సమస్యలతో బాధ పడుతుంటారు. అయితే హార్మోన్ల సమస్య రావడానికి ప్రధాన కారణం ఒత్తిడి. దీన్ని ధ్యానం, యోగాలతో తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు వెల్లడించారు. అలాగే వారంలో కనీసం ఐదు రోజుల పాటు ఉదయం కొంత సమయాన్ని కేటాయించి వ్యాయామం చేయాలి. దీనికోసం వాకింగ్, జాగింగ్ మీకు ఇష్టమైనది ఎంచుకోవచ్చు. అంతే కాకుండా పండ్లను మీ ఆహారంలో చేర్చుకోవాలి. బయట ఫుడ్స్ ను దూరంగా ఉంది ఇంటి భోజనాన్నే తీసుకోండి. వీటితో పాటు నీళ్లు తాగడం, ఊపిరి పీల్చుకోవడం, మంచి నిద్ర, విశ్రాంతి తీసుకోవడం, వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, కూరగాయలు వంటివి తీసుకోవాలి. చక్కెర ఎక్కువగా ఉన్న ఫుడ్స్ కు దూరంగా ఉండండి. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్ ను అవాయిడ్ చేయాలి. వీటిని పాటించడం వలన శరీరంలోని హార్మోన్లను నియంత్రణలో ఉంచుకోవచ్చని వైద్య నిపుణులు తెలిపారు.



Next Story