- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Honeypot Ants.. తేనె ఉత్పత్తి చేస్తున్న ఏకైక చీమల జాతి (వీడియో)
దిశ, ఫీచర్స్ : సహజ ఉత్పత్తిగా తెలిసిన తేనెను కేవలం తేనెటీగలే ఉత్పత్తి చేయవు. ఇదే జాతికి చెందిన అనేక ఇతరత్రా కీటకాలు, బంబుల్ బీస్, కందిరీగలు కూడా తీపి మిశ్రమాన్ని ఉత్పత్తి చేయగలవు. అన్నింటి కంటే మించి పుష్పాల్లో స్రవించే చక్కెర లాంటి ద్రవాన్ని అత్యంత అసాధారణమైన కీటకాలైన 'హనీపాట్ చీమలు' కూడా తేనెగా మార్చగలవు. వీటిలోనూ అనేక జాతులున్నప్పటికీ ప్రత్యేకించి 'కాంపోనోటస్ ఇన్‌ఫ్లాటస్, హనీపాట్ చీమలు' ఆహార కొరత ఉన్నప్పుడు అవసరమయ్యేలా తమ కాలనీల్లో తేనె నిల్వల కోసం పనిచేస్తాయి.
ఈ చీమలు వివిధ మొక్కల నుంచి సేకరించిన మకరందాన్ని వాటి పొత్తికడుపు ఎంత వరకు విస్తరిస్తుందో అంతరవకు నింపుకుంటాయి.'యాంట్ హనీ'గా పిలువబడే ఈ తీపి ద్రవం తమ కాలనీల సభ్యులకు జీవనోపాధి అవసరమైనప్పుడల్లా హనీపాట్ చీమలచే అందజేయబడుతుంది. కాంపోనోటస్ ఇన్‌ఫ్లాటస్ వంటి జాతులు.. హనీపాట్ చీమలకు తేనె, పూల మకరందాన్ని నిత్యం ఆహారంగా ఇస్తాయి. ఒకానొక సమయంలో తేనె చీమల పొత్తికడుపులు చాలా పెద్దవిగా మారిపోయి కదల్లేకుండా ఉంటాయి. కాబట్టి తోటి చీమలకు తమ విలువైన సరుకు అవసరమయ్యే వరకు తమ గూడు గది పైకప్పు నుంచి వేలాడదీయబడతాయి.
ఇక అనేక రకాల హనీపాట్ చీమలు.. ఆస్ట్రేలియా, యూఎస్‌ఏ, మెక్సికో, ఆఫ్రికా ఖండంలోని పొడి, ఎడారి లేదా పాక్షిక-శుష్క ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఇక్కడ ఆహార వనరులను కనుగొనడం కష్టంగా ఉంటుంది. కాబట్టి అవి తేనె ఉత్పత్తి, నిల్వపై ఆధారపడతాయి. ఇలా హనీపాట్ చీమలు చాలా విలువైన వనరు. కాబట్టి ఇతర చీమల కాలనీలు కొన్నిసార్లు వాటిపై దాడి చేసి దొంగిలిస్తాయి. ఆస్ట్రేలియాలో, ఆదివాసీలు తేనెతో నిండిన కీటకాలను కూడా బహుమతిగా ఇస్తారు. వాటి కోసం చుట్టుపక్కల పరిసరాల్లో తవ్వుతారు. 1990 డాక్యుమెంటరీ ట్రయల్స్ ఆఫ్ లైఫ్‌లో, డేవిడ్ అటెన్‌బరో స్వయంగా తన నోటిలోకి హనీపాట్ చీమను తీయడం చిత్రీకరించబడింది.
అయితే, తేనెటీగల తేనెతో పోలిక విషయానికొస్తే.. చీమల తేనె తక్కువ జిగటగా స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. తీపిగా ఉంటుంది కానీ మనుషులకు సరిపోయేంత తీపిగా ఉండదు. మరొక వ్యత్యాసం ఏమిటంటే, చీమల తేనెలో ఫ్రక్టోజ్ కంటే గ్లూకోజ్ అధిక పరిమాణంలో ఉంటుంది. రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.