Throat: గొంతులో గరగర వేధిస్తోందా? .. ఈ చిట్కాలు పాటిస్తే సరి!

by Prasanna |   ( Updated:2023-03-08 09:59:05.0  )
Throat: గొంతులో గరగర వేధిస్తోందా? .. ఈ చిట్కాలు పాటిస్తే సరి!
X

దిశ, ఫీచర్స్: గొంతులో గరగర, ఆహారం మింగుతున్నప్పుడు ఇబ్బందిగా ఉండటం, గడ్డకట్టినట్టుగా అనిపించడం వంటి సమస్యలు అన్ని రకాల వయస్సువారిలోనూ తలెత్తుతుంటాయి. జలుబు, ఫ్లూ, తలనొప్పి, సైనసైటిస్, దగ్గు వంటి లక్షణాలు ఉన్నప్పుడు కూడా గొంతు సమస్యలు మొదలవుతాయి. ఇలాంటి సమస్యలను చిట్కాలు లేదా కొన్ని రకాల ఔషధాలతో కూడా తగ్గించుకోవచ్చు అంటున్నారు ఆయుర్వేదిక్ నిపుణులు.

ఉప్పునీటితో పుకిలించడం

అల్లం కొద్దిగా దంచి నీటిలో వేసి మరిగించాలి. తర్వాత ఆ గోరు వెచ్చని నీటిలో ఉప్పు కలిపి నోటిలో పుకిలించటం ద్వారా గొంతులో గరగర, ఏదో అడ్డుపడుతున్న ఫీలింగ్ తగ్గిపోతాయి.

ఆవిరి పట్టడం

గొంతులో సమస్యగా ఉన్నప్పుడు కూల్ డ్రింక్స్, ఐస్ క్రీములను అవాయిడ్ చేయండి. గోరు వెచ్చటి నీటిని తాగటం మంచిది. సూప్స్, పండ్ల రసాలను తాగటంవల్ల కూడా గొంతులో ఇబ్బందిగా ఉంటే తగ్గిపోతుంది. గొంతులో అసౌకర్యాలను తగ్గించే మరో చిట్కా వేడి ఆవిరులను పీల్చడం. నీటిని వేడి చేసి, ఒక పెద్ద గిన్నెలో పోయాలి. అందులో కొద్దిగా పసుపు వేయాలి. వేడి నీటి గిన్నెకు కొద్ది దూరంలో తలను పెట్టి, పైనుంచి శుభ్రమైన టవల్‌ను కప్పుకొని ఆవిరి పీల్చాలి. దీనివల్ల గొంతు సమస్యతోపాటు జలుబు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

తేనె, నిమ్మరసం

గొంతులో కలిగే చికాకులు, సమస్యలు తగ్గాలంటే తేనె, నిమ్మరసం, గోరువెచ్చని నీటిలో కలిపిన తాగడంవల్ల ఉపశమనం లభిస్తుంది. దగ్గు, ఫ్లూ వంటి వాటిని తగ్గించే సామర్థ్యాన్ని తేనె, నిమ్మరసం కలిగి ఉంటాయి. శుభ్రమైన గ్లాసును తీసుకొని నిమ్మరసాన్ని పిండాలి. అందులో తేనె చుక్కలు వేయాలి. తర్వాత అందులో గోరు వెచ్చని టీనిని వేసి స్పూన్‌తో కలిపి తాగడంవల్ల గొంతు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఇవి కూడా చదవండి : Lemon: నిమ్మకాయలతో ఈ పని చేస్తే చాలు.. మీకు పట్టిన దరిద్రం పారిపోతుంది!

Advertisement

Next Story

Most Viewed