పెళ్లి ఎందుకు చేసుకుంటారో తెలుసా.. అసలు విషయం తెలిస్తే షాకవ్వాల్సిందే?

by samatah |
పెళ్లి ఎందుకు చేసుకుంటారో తెలుసా.. అసలు విషయం తెలిస్తే షాకవ్వాల్సిందే?
X

దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లి అనేది రెండు అక్షరాలే అయినా, రెండు మనసుల నూరేళ్ల జీవితం ముడిపడి ఉంటుంది. అయితే ఏ వ్యక్తి జీవితంలోనైనా పెళ్లి అనేది తప్పనిసరి.అయితే కొంత మందిలో ఒక డౌట్ ఉంటుంది. అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలని, కాగా, దీని వెనుక పెద్ద కారణమే ఉన్నదంట.

ప్రతి ఒక్క మనిషి మూడు గుణాలతో పుడతారట.. ఇందులో ఒకటి రుషి రుణం, రెండవది దేవరుణం, మూడవది పితృ రుణం. ఈ మూడు రుణాలను తీర్చడం ప్రతి వ్యక్తి యొక్క విధి. ఇందులో భాగంగానే,పితృ రుణం, అంటే మన వంశాన్ని కొనసాగించడం.మనకు జన్మనిచ్చి పెంచి పోషించిన వారి రుణాన్ని తీర్చుకోవాలంటే, వంశాన్ని అవిచ్చిన్నంగా కొనసాగించాలి. అంటే పితృదేవతలకు తర్ప నాది క్రియలు నిర్వహించే యోగ్యులైన సంతానాన్ని కనడం ద్వారా పితృ రుణాన్ని తీర్చుకోవాలి. సంతానం కావాలంటే వివాహం చేసుకోవాలి. అందువలన ప్రతీ ఒక్కరు పెళ్లి చేసుకోవాలి అంటారు పెద్దలు.

Advertisement

Next Story

Most Viewed