- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పొరపాటున ఆపిల్ గింజలు మింగేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..
దిశ, ఫీచర్స్ : ఆపిల్ తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజుకు ఒక ఆపిల్ తింటే అసలు డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరమే ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నాయి. ఆపిల్ లో విటమిన్ ఏ, బి, ఇ, సి, విటమిన్ బి1, విటమిన్ బి6, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. అందుకే చాలా మంది ప్రతిరోజు యాపిల్ పండుని తమ డైట్ లో తీసుకుంటారు. ఆపిల్స్ లో ఉండే పాలీఫెనాల్స్ కణాల ఆరోగ్యాన్ని కాపాడేందుకు దోహదపడతాయి. జీవక్రియకి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే క్యాన్సర్స్‌ని కూడా తగ్గించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
అయితే ఆపిల్స్ తినేటప్పుడు కాస్త జాగ్రత్తలు వహించాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఆపిల్స్ లోని విత్తనాలు మింగితే అది స్లో పాయిజన్ లాగా మారి శరీరం పై పనిచేస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. దాని విత్తనాలు మింగితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయట. అందులోని అమిగ్డాలిన్ జీర్ణ ఎంజైమ్‌లతో ప్రతిచర్య జరిపి సైనైడ్‌ని రిలీజ్ చేస్తుంది. విత్తనాలను నమిలినప్పుడు హైడ్రోజన్ సైనైడ్‌ని రిలీజ్ అవుతుందట. దీని కారణంగా తలనొప్పి, వికారం, కడుపు నొప్పి వస్తుంది. ఎక్కువ మొత్తంగా గింజలని తీసుకుంటే ఒక్కోసారి కోమాకి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒకటి, రెండు గింజలు తింటే పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ ఎక్కువగా తింటే ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు. ఆపిల్ తినేటప్పుడు కొంతమంది పైన తొక్క తీయడం వలన పోషకాలు సరిగ్గా అందవని చెబుతున్నారు.