చికెన్ లివర్ తింటున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!!

by Anjali |   ( Updated:2024-01-24 06:20:35.0  )
చికెన్ లివర్ తింటున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!!
X

దిశ, ఫీచర్స్: చికెన్ అనగానే ప్రతి ఒక్కరికీ నోట్లో ఊరిళ్లు పుడతాయి. చిన్నా పెద్దా అని తేడా లేకుండా చికెన్ లాగిస్తుంటారు. చికెన్ మంచూరియా, చికెన్ ఫ్రై, చికెన్ 65, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, గ్రిల్ చికెన్, గోంగూర చికెన్, చికెన్ బిర్యాని.. ఇలా చికెన్‌తో ఏ ఐటెమ్ తయారు చేసినా ఎంతో ఇష్టంగా తింటారు. కొంతమందైతే డైలీ చికెన్ వండి పెట్టినా ఎలాంటి మోహమాటం లేకుండా కాదనకుండా తినేవారుంటారు. ఆరోగ్యానికి చికెన్ కన్నా మటన్ అని తెలిసినా చికెన్ ప్రియులే ఎక్కువగా ఉన్నారు. చికెన్ తినడం వల్ల మన శరీరానికి ప్రోటీన్లు పుష్కలంగా అందుతాయి.

అలాగని క్రమం తప్పకుండా చికెన్ తినడం అంత మంచిది కాదు. మన ఆరోగ్యానికి ఎంత మేలు చేసే ఆహారమైన పరిమితిగా తింటేనే ఆరోగ్యానికి మంచిది. కాగా డైలీ చికెన్ తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. అయితే కొంతమంది ఎంతో ఇష్టంగా చికెన్ లాగించినప్పటికీ చికెన్ లివర్ తినడానికి అస్సలు ఇష్టపడరు. మరికొంతమంది లివర్ వల్ల అనారోగ్య సమస్యలేమైనా ఎదుర్కోవాల్సి వస్తదని తినడానికి వెనకడుగు వేస్తారు. తాజాగా చికెన్ లివర్‌తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో వైద్య నిపుణులు వెల్లడించారు.

చికెన్‌లోని కాలేయాన్ని కొంతమంది లొట్టలేసుకుంటూ తింటారు. కొంతమంది మాత్రం లివర్ తినడానికి ఆసక్తి చూపించరు. అయితే చికెన్ కాలేయంలో చాలా పోషకాలుంటాయి. అవి మన ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతో మేలు చేస్తాయి. అలాగే లివర్‌లో బి విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి ప్రెగ్నెన్సీ మహిళలకు, వారి గర్భంలో పెరుగుతున్న పిల్లలకు ప్రోమెటమాలిక్ శక్తి యొక్క అదనపు బూస్ట్ అందిస్తుంది.

3.5 ఔన్స్‌లో చికెన్ లివర్‌లో 12 మైక్రోగ్రాముల కేటు ఉంటుంది. ఇవి శరీరంలోని రక్తం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. రక్తహీనతతో బాధపడుతున్న వారికి లివర్ మంచి మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. రక్తహీనత కణాల సమస్యలు ఉన్నవారికి కంటి సమస్యలు, గోర్లు సమస్యలు ఉన్నవారికి లివర్ ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఇమ్యూనిటీ పెంచుతుంది. చికెన్ లివర్‌తో కళ్ళు, చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో విటమిన్ ఎ కీలక పాత్ర పోషిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed