పరిస్థితులను, దృశ్యాలను ఊహించుకోలేని మానసిక రుగ్మత.. అఫాంటాసియా గురించి విన్నారా?

by Javid Pasha |
పరిస్థితులను, దృశ్యాలను ఊహించుకోలేని మానసిక రుగ్మత.. అఫాంటాసియా గురించి విన్నారా?
X

దిశ, ఫీచర్స్ : ఆకుపచ్చని గుబుర్లలో అరవిరిసిన రంగు రంగుల పువ్వులను మీరెప్పుడైనా పరిశీలనగా చూశారా? ఎత్తైన కొండల నుంచి జాలువారే జలపాతాన్ని మనసారా ఆస్వాదించారా? ఆకాశంలో ఇంధ్ర ధనస్సును, నేలపై పచ్చని ప్రకృతిని చూసిన సందర్భాలను గుర్తు తెచ్చుకుంటూ ఆనంద పారవశ్యంలో మునిగిపోయారా? అయితే మీలో గొప్ప ఇమాజినేషన్ పవర్ ఉన్నట్లే అంటున్నారు నిపుణులు. ఒకవేళ ఇలాంటి ఊహాజనిత సామర్థ్యం లేకపోతే.. దానిని ‘అఫాంటాసియా’గా పేర్కొంటున్నారు నిపుణులు. వాస్తవానికి ఇదొక మానసిక రుగ్మత.

ఇమాజినేషన్‌లో ఇబ్బంది

మనం చూసిన అందమైన ప్రదేశాలు, వస్తువులు, తిరిగిన ప్రాంతాలు, మాట్లాడిన వ్యక్తులు.. ఇలా ఎన్నో అనుభవాలు మనసులో జ్ఞాపకాలుగా ముద్ర వేసుకుంటాయి. ఖాళీగా ఉన్నప్పుడో, హృదయాంతరాల్లో భద్రంగా దాగి ఉన్న మెమోరీస్ తాలూకు పరిస్థితులు మరోసారి కనిపించిప్పుడో గత పరిస్థితులకు సంబంధించిన ఇమాజినేషన్స్ ఒక్కసారిగా కళ్ల ముందు క్రియేట్ అవుతుంటాయి. ఇలా జరగకపోతే ఎవరూ సంతోషంగా ఉండలేరు. అందుకే ఈ సమస్యను ఎదుర్కొనేవారి మనసు గుడ్డిది అంటుంటారు నిపుణులు.

మెదడు మనసు మాట వినదు

‘కళ్లతో మాత్రమే కాదు, ఒక్కసారి మనసుతో కూడా చూడండి అంటుంటారు కొందరు. ఎందుకంటే మనం ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో, ఊహించుకోవడంలో ఇవి రెండు కీలక పాత్ర పోషిస్తాయి. మనసులోని భావాలను ఊహించుకోగల దృశ్యమాన సామర్థ్యం(Visual ability) ద్వారానే ఇది సాధ్యం అవుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇలా పాజిబుల్ కాని పరిస్థితులు లేదా అనుభవాలు ఎదురవుతున్నాయంటే సదరు వ్యక్తులు ‘అఫాంటాసియా’ స్థితిలో ఉన్నట్లు లెక్క. అంటే ఇక్కడ వారి మైండ్ చెప్పేది బ్రెయిన్ యాక్సెప్ట్ చేయలేని సిచ్యువేషన్‌లో ఉంటుందని మానసిక నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల బాధితులు ఒక దృశ్యానికి సంబంధించిన మెంటల్ పిక్చర్‌ను తమ మనసులో క్రియేట్ చేసుకోలేరు.

విజువలైజ్ చేయలేరు

గతంలో లేదా ఇటీవల చూసిన ఒక ప్రదేశాన్ని గానీ, ఒక వస్తువును గానీ తమ మనసులో ‘ఊహా చిత్రం’గా ఫీల్ అవ్వగలరు. ఉదాహరణకు మీరొక మ్యూజియం చూశారనుకోండి. దానిని విజువలైజ్ చేయాలని అడిగితే తప్పక చేస్తారు. కానీ అఫాంటాసియా బాధితులు మాత్రం అలా చేయలేరు. వారు నిత్యం మ్యూజియంలో పనిచేసేవారైనా సరే.. అక్కడి నుంచి ఇంటికి వచ్చాక దాని తాలూకు రూపం, జ్ఞాపకం వారి కళ్లముందు కదలాడలేవు. దాని ఆకారాన్ని ఊహించుకొని మనకు వివరించలేరు. ఇలా మనుషులు, శబ్దాలు, ఆకారాలు ఏవైనా సరే వాటిని ఊహించుకునే సామర్థ్యాన్ని కోల్పోవడం అనేది మానసిక, సామాజిక సమస్యగా ఉంటుంది.

కారణాలు

వాస్తవ పరిస్థితులను ఊహించుకోలేని మానసిక స్థితికి ప్రత్యేకించి ఒకటే కారణం ఉండదని నిపుణులు అంటున్నారు. కొందరిలో పుట్టుకతో ఏర్పడవచ్చు. మరి కొందరిలో మిడిల్ ఏజ్‌లో ఏర్పడవచ్చు. అయితే మధ్య వయస్సులో ఈ ప్రాబ్లం రావడానికి నరాల తీవ్రమైన బలహీనత, వ్యాధులు, మెదడుకు గాయాలు, బ్రెయిన్ స్ట్రోక్ వంటివి కారణాలుగా ఉండవచ్చునని వైద్య నిపుణులు, మానసిక నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ‘మెంటల్ పిక్చర్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేసినప్పుడు అఫాంటాసియా లేనివారితో పోల్చితే దానితో బాధపడేవారు వేర్వేరు మెదడు నమూనాలను కలిగి ఉన్నట్లు న్యూరాలజిస్టుల పరిశోధనల్లో తేలింది. అయితే ఈ సమస్యలు అందరికీ ఉంటాయని మాత్రం కాదు, ప్రపంచ వ్యాప్తంగా 2.1 శాతం నుంచి 2.7 శాతం మంది ప్రస్తుతం అఫాంటాసియాను ఎదుర్కొంటున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

అధ్యయనాలు.. పరిష్కారం

ఇమాజినేషన్ క్రియేట్ చేసుకోలేని మానసిక రుగ్మతను అనారోగ్యంగా లేదా పూర్తి వైకల్యంగా పరిగణించలేమని నిపుణులు అంటున్నారు. అంటే అఫాంటాసియా సీరియస్ మెడికల్ కండిషన్‌ కాదు. చరిత్రలో ఎంతో మంది ప్రముఖులు దీనిని ఎదుర్కొన్నట్లు అధ్యయనాలు చెప్తున్నాయి. మొదటిసారిగా 1880లో పరిశోధకుడు సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఈ మానసిక స్థితిని గుర్తించాడు. ఆ తర్వాత 19 శతాబ్దంలోనూ కొంతమంది బాధితులపై అధ్యయనాలు జరిగినట్లు ప్రముఖ న్యూరాలజిస్ట్ ఆడమ్ జెమాన్ పేర్కొన్నాడు. దృశ్యాలను ఊహించుకోలేని ఈ పరిస్థితికి మొట్ట మొదటిసారిగా ‘అఫాంటాసియా’ అనే పదాన్ని ఇతనే యూజ్ చేశాడు. ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతోంది. 2017లో జరిగిన ఒక స్టడీ ప్రకారం.. ఈ రుగ్మతకు సైంటిఫిక్ మెథడ్‌లో ట్రీట్మెంట్ లేదు. పైగా ఇది అందరికీ రాదు. వచ్చిన వారికి మధ్యలోనే తగ్గిపోవచ్చు. కొన్నిసార్లు న్యూరాలజిస్టుల కౌన్సెలింగ్ లేదా ట్రీట్మెంట్ ద్వారా తగ్గిపోవచ్చు.

Advertisement

Next Story