మహిళలు బ్రాండెడ్ లోదుస్తులు కొంటున్నారా? పిల్లలను కనే అవకాశం లేకుండా చేస్తాయేమో జాగ్రత్త..

by Sujitha Rachapalli |
మహిళలు బ్రాండెడ్ లోదుస్తులు కొంటున్నారా? పిల్లలను కనే అవకాశం లేకుండా చేస్తాయేమో జాగ్రత్త..
X

దిశ, ఫీచర్స్ : మహిళల లోదుస్తుల్లో విషపూరిత రసాయనాలు ఉన్నట్లు హెచ్చరించింది తాజా అధ్యయనం. హంగేరి, ఆస్ట్రియా, స్లోవేనియా, చెక్ రిపబ్లిక్‌లలోని వినియోగదారుల లోదుస్తులను పరీక్షించిన పరిశోధకులు.. వీటిలో ఎండోక్రైన్-అంతరాయం కలిగించే ప్రమాదకరమైన రసాయనాలు ఎక్కువ స్థాయిలో ఉన్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ తయారు చేసేందుకు ఉపయోగించే సింథటిక్ కెమికల్స్ అయిన బిస్ ఫినాల్స్ మానవ ఆరోగ్యానికి హాని చేకూరుస్తాయని.. ముఖ్యంగా చౌకైన ప్యాంటీల కంటే బ్రాండెడ్ ప్రొడక్ట్స్ లోనే ఎక్కువగా ఉన్నట్లు హెచ్చరించారు. మహిళల కోసం కాటన్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ.. మహిళల ప్యాంటీలు ఎక్కువ భాగం సింథటిక్ పదార్థాలతో తయారు చేయబడ్డాయని తేలిందన్నారు.

యూరోపియన్ ఎన్విరాన్‌మెంట్ ఏజెన్సీ ప్రకారం.. బిస్ఫినాల్ A ప్రజల సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. కంటికి హాని కలిగిస్తుంది. ఊపిరితిత్తులను చికాకుపెడుతుంది. స్కిన్ అలెర్జీకి దారి తీస్తుంది. హార్మోన్ వ్యవస్థకు అంతరాయం కలిగిస్తుంది. అభిజ్ఞా పనితీరు, జీవక్రియను ప్రభావితం చేస్తుంది. ఈ కెమికల్స్ చాలా వరకు ఆహారం, పానీయాల ద్వారా ఎక్స్ పోజ్ అవుతాయి. కానీ చర్మం ద్వారా కూడా రసాయనాలను గ్రహించే అవకాశం ఉంది.

గత సంవత్సరం.. EU నిధులతో జరిపిన ల్యాబ్ పరీక్షల్లో 11 యూరోపియన్ దేశాల్లోని 92 శాతం ప్రజల మూత్రంలో బిస్ఫినాల్ A ఉన్నట్లు కనుగొనబడింది. అందుకే పసిబిడ్డల కోసం వినియోగించే బేబీ బాటిల్స్, ఫుడ్ ప్యాకేజింగ్ వంటి కొన్ని ఉత్పత్తులలో ఈ పదార్ధం ఇప్పటికే నిషేధించబడింది. పిల్లల బొమ్మలు వంటి మరికొన్నింటిలోనూ పరిమితం చేయబడింది. ఆహారం, పానీయాల ప్యాకేజింగ్‌లో బిస్ఫినాల్ A ని నిషేధించే ప్రణాళికకు ఇప్పటికే చాలా దేశాలు మద్దతు ఇచ్చాయి.

Advertisement

Next Story

Most Viewed