- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భాగస్వామితో పడుకునే ఇంట్రెస్ట్ లేదు.. తాజా సర్వే..
దిశ, ఫీచర్స్: సాధారణంగా దంపతులు కలిసి పడుకునేందుకు ఇష్టపడుతుంటారని అనుకుంటాం. కానీ అమెరికాలో వన్‌పోల్ సంస్థ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం ఐదుగురిలో ఇద్దరి కంటే ఎక్కువ మంది సెపరేట్‌గా పడుకునేందుకే ఇంట్రెస్ట్ చూపుతున్నారని తేలింది. నిద్రకు ఉపక్రమించే ముందు విసిగించడం, లేపడం, పడుకున్నాక టర్న్ చేయడం, టెలివిజన్‌ను ఆన్ చేసి నిద్రపోతుండటం, గురక, లైట్స్ ఆన్ చేయడం వంటివి చికాకు కలిగిస్తున్నాయని.. అందుకే హెల్తీ స్లీప్ కోసం వేరుగా పడుకునేందుకు మొగ్గుచూపుతున్నారని చెప్పారు.
ఇక ‘పడుకునే ముందు స్నానం చేస్తారా?’ అని సర్వే ప్రశ్నించగా.. మూడింట రెండొంతుల మంది అవునని సమాధానమిచ్చారు. 58 శాతం మంది భాగస్వామి నిద్రించే ముందు స్నానం చేయకపోవడం మూలంగా ఇబ్బంది పడుతున్నామని వివరించారు. ఇక పిల్లల వల్ల కూడా డిస్టర్బ్ అయ్యే తల్లిదండ్రులు ఉన్నట్లు తెలిపిన సర్వే.. వారానికి మూడు సార్లు తమ బెడ్ దగ్గరికి వచ్చే చిన్నపిల్లల వల్ల మేల్కొంటున్నట్లు తెలిపారు. ఐదుగురిలో ఒకరు ఈ పరిస్థితితో బాధపడుతున్నట్లు చెప్పారు. ఇక దీనిపై స్పందిస్తున్న నిపుణులు.. డే టైమ్ యాక్టివ్‌గా ఉండాలంటే గొప్ప నిద్ర అవసరం కాబట్టి బెడ్ టైమ్‌లో అనవసరమైన పరధ్యానం తొలగించి, దానిని నిద్రాభరణంగా మార్చుకోవాలని సూచిస్తున్నారు.
Read more: