మహిళలకు గుడ్‌న్యూస్.. రొమ్ము క్యాన్సర్ ఉందో లేదో నిమిషంలో గుర్తించే బ్రా వచ్చేసింది.. ధరెంతంటే?

by Anjali |
మహిళలకు గుడ్‌న్యూస్.. రొమ్ము క్యాన్సర్ ఉందో లేదో నిమిషంలో గుర్తించే బ్రా వచ్చేసింది.. ధరెంతంటే?
X

ఫీచర్స్: ప్రస్తుత రోజుల్లో మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ పెద్ద సమస్యగా మారిపోయింది. రొమ్ము క్యాన్సర్ అనేది ప్రాణాంతక వ్యాధి. చర్మం రంగు మారడం, నొప్పి, దురద, బ్రెస్ట్‌లో మూడింట ఒక వంతు వరకు దద్దుర్లు రావడం, రొమ్ముల్లో ఒకదానిలో వాపు, తలకిందులుగా లేదా చనుమొనలు ముడుచుకుపోవడం వంటివి బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు. సకాలంలో ఇవి గుర్తించి చికిత్స తీసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదమని తరచూ వైద్యులు చెబుతూనే ఉంటారు. ఈ క్రమంలో మహిళలకు ఓ గుడ్‌న్యూస్ అందింది. వన్ మినిట్‌లో బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తించే బ్రాను నిపుణులు తయారు చేస్తున్నారట. ఒక మహిళ తనకు రొమ్ము క్యాన్సర్ ఉందో లేదో ఇక నుంచి 1 నిమిషంలోనే తెలుసుకోవచ్చు.

కాన్పూర్ ఐఐటీకి చెందిన రీసెర్చ్ ఫెలో శ్రేయా నాయ్ అనే వ్యక్తి కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఒక ఏడాదిలో ఒక స్పెషల్ బ్రాను రెడీ చేశారట. ఈ స్మార్ట్ బ్రా అనేది ఒక పోర్టబుల్ పరికరం. ఇందులోకి మహిళలు తమ జీవనశైలి డేటాను అందించవల్సి ఉంటుందట. ఈ బ్రాను ముప్పై రోజులు అనగా ఒక నెల యూజ్ చేయవచ్చు. ఇది వన్ మినిట్‌లోనే మహిళల్లోని రొమ్ము క్యాన్సర్‌ను గుర్తిస్తుంది. పోర్టబుల్ పరికరంతో తయారు చేయబడింది కాబట్టి ఎక్కడికైన తీసుకెళ్లొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ పరికరాన్ని బ్రా లోపల ధరించాలి. ఈ బ్రా ధర రూ. 5 వేలు ఉంటుందట. ఇది మార్కెట్‌లోకి రావాలంటే కొంతకాలం సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed