లవర్స్‌కు గుడ్ న్యూస్.. పెళ్లి చేసి ఆశ్రమం ఇచ్చే గ్రామం.. ఎక్కడో తెలుసా..?

by sudharani |   ( Updated:2023-05-21 10:49:36.0  )
లవర్స్‌కు గుడ్ న్యూస్.. పెళ్లి చేసి ఆశ్రమం ఇచ్చే గ్రామం.. ఎక్కడో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: చాలా మంది ప్రేమికులు తమ ప్రేమను నిలబెట్టుకునేందుకు ఎంతకైన తెగిస్తారు. మొదట ఇంట్లో వాళ్లను ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ.. కులాలు, మతాలు పేరిట వారి ప్రేమను పెద్దలు నిరాకరిస్తారు. ఈ క్రమంలో అబ్బాయి, అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటారు. అలాంటి ప్రేమికులకు ఓ గుడ్ న్యూస్. పారిపోయిన వచ్చిన ప్రేమికులకు అభయం ఇచ్చే ఆలయం ఒకటి ఉంది. అది ఎక్కడో కాదండోయ్ మన ఇండియాలోనే. అదే హిమాచల్ ప్రదేశ్‌లోని కులు షాంఘర్ గ్రామంలో ఉన్న షాంపుల్ మహాదేవ్ ఆలయం.

దట్టమైన చెట్ల మధ్య ఉండే ఈ ఆలయంలోని శివుడు భక్తులను ఆశ్వీరదించడమే కాకుండా.. పారిపోయి వచ్చిన ప్రేమికులకు కూడా ఆశ్రయమిస్తాడు. అక్కడి గ్రామస్థులు ప్రేమికులకు పెళ్లి చేయడమే కాకుండా వాళ్లకు తినడానికి తిండి పెట్టి ఉండటానికి ఆశ్రయం కూడా ఇస్తారు. ఇంకో విశేషం ఏమిటంటే.. అక్కడ పోలీసులకు నిషేధం. ప్రేమికుల ఇరు కుటుంబాలు రాజీపడే వరకు అక్కడ నుంచి ప్రేమికులను పంపించరు. నిజమైన ప్రేమికులకు అండగా నిలిచే ఈ గ్రామం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Also Read...

ఒక్క కౌగిలింతలో ఎన్ని భావాలో.. శృంగారానికి తొలి మెట్టు అదే..

Advertisement

Next Story