మరణం తప్పదా ?.. మరో పదేండ్ల తర్వాత జరిగేది ఇదే .. ఎందుకంటే..

by Javid Pasha |
మరణం తప్పదా ?.. మరో పదేండ్ల తర్వాత జరిగేది ఇదే .. ఎందుకంటే..
X

దిశ, ఫీచర్స్ : సహజంగా ఏ తీవ్రమైన అనారోగ్యంవల్లనో, అంతుపట్టని కొత్త వేరియంట్ల వల్లనో, ప్రమాదాల కారణంగానో మరణాలు సంభవిస్తుంటాయి. కానీ మరో పదేండ్లలో మానవులు జస్ట్ ఇన్ఫెక్షన్లు సోకితే మరణించే అవకాశం లేకపోలేదని ఒక అధ్యయనం పేర్కొన్నది. ‘గ్లోబల్ డెత్ స్టాటిస్టిక్స్ కంపారెటివ్ ఎనాలిసిస్‌’లో భాగంగా సైంటిస్టులు ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రభావాన్ని స్టడీ చేశారు. ఒక దశాబ్దం క్రితం ఫంగల్ ఇన్ఫెక్షన్ల కారణంగా వరల్డ్ వైడ్ దాదాపు రెండు మిలియన్ల వార్షిక మరణాలు సంభవించాయనేది ప్రాథమిక అంచనా. అయితే ఇటీవలి పరిశోధనలు మాత్రం ఆ మరణాలు దాదాపు రెండు రెట్లు పెరుగవచ్చని పేర్కొంటున్నాయి. ప్రస్తుత అంచనా ప్రకారం సుమారు 3.8 మిలియన్ల మరణాలు ఉన్నాయి. ఈ సంఖ్య మరో పదేండ్లలో 6.8 శాతానికి చేరవచ్చు. ముఖ్యంగా ఫంగల్ నిర్ధారణలో, దానివల్ల సంభవించే వ్యాధుల చికిత్సలో ఆలస్యం జరగడం కారణంగా ఆస్పెర్‌గిల్లస్ వంటి ఇన్‌ఫెక్షన్ల బారిన పడినవారు తక్కువ సమయంలోనే మరణించే చాన్స్ ఉంటుంది.

దేనివల్ల ఎన్ని మరణాలు..

గ్లోబల్ డెత్ స్టాటిస్టిక్స్ కంపారెటివ్ ఎనాలిసిస్‌ ప్రకారం ఫంగల్ ఇన్ఫెక్షన్లు మరణాలకు ప్రేరణగా నిలుస్తున్నాయి. ఇప్పటి వరకు సంభవించిన ఇన్ఫెక్షన్లను పరిగణిస్తే న్యుమోనియాతో 2,600,000 (including some fungal cases) మంది, క్షయవ్యాధి వల్ల 1,208,000 ( గుర్తించబడని శిలీంధ్ర వ్యాధులతో సహా) మంది మరణించారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా 3,228,000 మరణాలలో మూడింట ఒక వంతు స్మోక్ రిలేటెడ్ లంగ్ డిసీజెస్‌(COPD) కారణంగా సంభవిస్తున్నాయి. ఇటీవల ఫంగల్ వ్యాధి నిర్ధారణలో కొంత పురోగతి ఉన్నప్పటికీ, తక్కువ-ఆదాయ దేశాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా నిర్ధారణ పరీక్షలు, సౌకర్యాల కొరత కారణంగా ఫంగల్ నిర్ధారణ పరీక్షలు పెద్దగా సాధ్యం అవడం లేదని నిపుణులు చెప్తున్నారు.

డెత్ రిలీటెడ్ ఇన్ఫెక్షన్లకు కారణం?

ముఖ్యంగా ఆస్పెర్‌గిల్లస్ ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌లను సరైన సమయంలో గుర్తించకపోవడంవల్ల చాలామంది వివిధ అనారోగ్యాల బారిన పడినప్పుడు త్వరగా మరణిస్తున్నారని పరిశోధకులు అంటున్నారు. ప్రాణాంతక ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌లకు కారణమైన ప్రాథమిక శిలీంధ్రాలుగా ఆస్పెర్‌గిల్లస్ ఫ్యూమిగాటస్ అండ్ ఆస్పెర్‌గిల్లస్ ఫ్లేవస్ ప్రసిద్ధిం చెందాయి. అలాగే ఆస్తమా, క్షయ, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి ఇంటర్నల్ లంగ్ డిసీజెస్ బాధితులు, అలాగే లుకేమియా ఉన్నవారు లేదా అవయవ మార్పిడికి గురైన వారు అధిక మరణ ప్రమాదాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మిస్ డయాగ్నోసిస్ లేదా హెల్త్ కేర్ ప్రొవైడర్ల ద్వారా ఆలస్యంగా గుర్తించబడటం, సరిపోని రోగనిర్ధారణ పరీక్షలు, సమర్థవంతమైన యాంటీ ఫంగల్ ఔషధాల కొరత ఇన్ఫెక్షన్లతో సంబంధం ఉన్న మరణాలకు దోహదం చేస్తుంది. యాంటీబయాటిక్ నిరోధకతను గుర్తుచేసే సమాంతర సవాలుతో యాంటీ ఫంగల్ నిరోధకత పెరుగుతోంది. పంటలపై పిచికారి చేసే కొన్ని యాంటీ ఫంగల్ లిక్విడ్స్ కూడా అజోల్ వంటి యాంటీ ఫంగల్ ఔషధాలకు నిరోధక రేట్లను తీవ్రతరం చేస్తున్నాయి. ఇవి సమర్థవంతమైన చికిత్సకు గణనీయమైన ముప్పును కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల కారణంగా మరో దశాబ్దంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ మరణాలు పెరిగే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed