పెళ్లికి ముందే సెక్స్ (SEX).. భారత యువత ఏం అనుకుంటుందో తెలిస్తే షాక్

by Hamsa |   ( Updated:2022-08-30 11:50:05.0  )
పెళ్లికి ముందే సెక్స్ (SEX).. భారత యువత ఏం అనుకుంటుందో తెలిస్తే షాక్
X

దిశ, ఫీచర్స్ : ఇండియాలో పెళ్లికి ముందు శృంగారం ఇప్పటికీ నిషిద్ధమే. పాశ్చాత్య సంస్కృతిని స్వీకరించినా.. వారి జీవనశైలి, సంస్కృతిని గ్రహించినా.. సమాజంలో లోతుగా పాతుకుపోయిన ఈ నిషేధం నుంచి విముక్తి పొందడంలో మాత్రం విఫలమవుతున్నాం. దీని గురించి ఇప్పటికీ గుసగుసగానే మాట్లాడుకుంటున్నాం. మోడ్రన్ లవ్, డేటింగ్ కల్చర్ స్ప్రెడ్ అవుతున్నా సరే.. ఈ విషయంలో మాత్రం స్వేచ్ఛ పొందలేకపోతున్నాం.

ఒకవేళ దీనిపై ఓపెన్‌గా మాట్లాతే తప్పుచేస్తున్నట్లుగా విమర్శనాత్మక చూపులు ఎదుర్కోక తప్పట్లేదు. వివాహానికి ముందు స్త్రీల 'పవిత్రత' అనే ముసుగులో షరతులకు లోబడే జీవిస్తున్న నేటితరం.. ఈ నియమాలకు గుడ్ బై చెప్పాలనుకుంటుంది. సొసైటీకి అనుగుణంగా కాకుండా తమ ఇష్టాలకు లోబడి నడుచుకోవాలని అనుకుంటుంది.

వివాహానికి ముందు ఎవరితోనైనా శారీరక సంబంధం కలిగి ఉండటం ఇప్పటికీ అనైతికంగా, పాపంగా పరిగణించబడుతుంది. భారతీయ సమాజం, సంస్కృతి దీనికి వ్యతిరేకంగా ఉండటమే ఇందుకు కారణం. కాగా రాబోయే తరం మాత్రం తమకంటూ అభిప్రాయాలను కలిగి ఉంది. ప్రీమారిటల్ సెక్స్ ఫ్రీడమ్ కావాలని వాదిస్తోంది. పైగా ఈ పద్ధతి పలు లాభాలతో కూడుకున్నదని వివరిస్తోంది.

సెక్స్ (SEX) ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ :

వివాహానికి ముందు సెక్స్ అనేది భారతీయ సమాజంలో నిషిద్ధం. అసలు ఇక్కడ సెక్స్ గురించి మాట్లాడటమే ఒక పాపం. మహిళల లైంగికతను నియంత్రించాలనే లోతైన కోరికే దీనికి కారణం కాగా నేటికీ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడాన్ని నిషేధించారు. కన్యత్వం అనే భావన.. పవిత్రమైన, ఆదర్శవంతమైన భార్య అనేది భారతీయుల మనసుల్లో లోతుగా పాతుకుపోయింది.

ఈ కళంకాన్ని చిన్న వయస్సులోనే సరైన సెక్స్ ఎడ్యుకేషన్ అందించడం ద్వారా రూపుమాపవచ్చని చెబుతోంది ఈ జనరేషన్. కానీ మన దేశం ఈ సబ్జెక్ట్‌ను పాఠశాలల్లో అమలు చేయడానికి ఇష్టపడదు. కానీ ఈ ఆలోచనలో మార్పు రావాలి. మరింత మంది యువకులకు సెక్స్ ఫ్రీడమ్ భావనను పరిచయం చేయాల్సిన అవసరం ఉంది.

సుప్రీంకోర్టు చెప్పినా మార్పు లేదు :

నిజానికి వివాహానికి ముందు సెక్స్ అనే విషయంలో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా జడ్జ్ చేయబడతారు. లివ్-ఇన్ కల్చర్, ఓపెన్ మ్యారేజీలు, ఆన్‌లైన్ డేటింగ్, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ లాంటి చాలా రకాల పద్ధతులున్నా.. 'పార్సిల్ ఆఫ్ లైఫ్' అనే వాస్తవం నుంచి పారిపోలేని కాలంలో జీవిస్తున్నాం. వివాహానికి ముందు సెక్స్‌లో పాల్గొనడం అనేది పూర్తిగా వ్యక్తిగత ఎంపిక మరియు ఇది నేరం కాదని భారత సుప్రీంకోర్టు కూడా ఒక సమయంలో చెప్పింది. అయినా సరే ఇలాంటి పనిచేస్తే.. గైనకాలజిస్ట్‌లు, కాబోయే భాగస్వాములు, కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి ఎందుకు తప్పుచేశామనే చూపులను ఎదుర్కొంటున్నాం? ఇది స్వేచ్ఛా ప్రపంచం, దీన్ని అరికట్టడానికి బదులుగా మనం ఆ స్వేచ్ఛను జరుపుకోవాలి. అయితే ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సురక్షితమైన సెక్స్‌ను ఆచరించడం ప్రధానం.

పార్ట్‌నర్ కెపాసిటీ తెలియక్కర్లేదా?

బెడ్‌లో ఎలా ఉంటాడో తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకోవడం నిజంగా ఆందోళన కలిగించే విషయమని అంటోంది నేటి యువత. దాంపత్యంలో సెక్స్ జీవితం ముఖ్యమని.. దాని గురించి తెలుసుకోకుండా జీవితమంతా ఇరుక్కుపోవడం మూర్ఖత్వం అవుతుంది. భాగస్వామి స్టామినా ఏంటో తెలుపుకోవడం మంచిదని చెప్తున్న యూత్.. వాస్తవానికి సెక్స్ అనేది జీవితంలో చాలా ముఖ్యమైనది అంటున్నారు.

అసంబద్ధమైన తీర్పు :

ఇద్దరు వ్యక్తుల మధ్య సెక్స్ గురించి స్వేచ్ఛగా తీర్పు చెప్పే సమాజం కంటే కూడా వారిద్దరే ఈ విషయంలో ఎక్కువ సంబంధం కలిగి ఉంటారు. శారీరక సాన్నిహిత్యానికి పరస్పరం అంగీకరిస్తున్నంత కాలం, ఇతరుల దృక్కోణం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేటి ప్రపంచంలో నైతిక తీర్పు సంబంధితమైనది కాదు. పాశ్చాత్య సంస్కృతికి సంబంధించిన జీవనశైలి, అభ్యాసాన్ని సులభంగా నేర్చుకుంటున్న మనం.. లైంగికత విషయంలో మాత్రం ఎందుకు వెనక్కి తగ్గుతున్నాం. ఈ తరం తమ అవసరాలు, ప్రాధాన్యతలను కనుగొనలేదా? అలాంటప్పుడు ఇన్ని నిషేధాజ్ఞలు దేనికి? అని ప్రశ్నిస్తున్నారు.

భావోద్వేగ బంధాన్ని బలోపేతం చేస్తుంది:

పెళ్లికి ముందు సెక్స్ అనేది పూర్తిగా పర్సనల్. శారీరకంగా కనెక్ట్ అవ్వడం.. భావోద్వేగ సంబంధాలను పెంపొందించడంలో సహాయపడుతుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య అవసరమైన సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. సహజంగా ఆహ్లాదకరమైన ఈ అంశాన్ని సాధారణీకరించి ఆనందించాలి.

ప్రీమ్యారిటల్ సెక్స్ (SEX) సాధారణం కావాలి:

పెళ్లికి ముందు సెక్స్ అనే భావన సాధారణీకరించబడాలి అంటోంది యువతరం. భారతీయ సమాజం ఈ విషయాన్ని 'ద్రోహం'గా చిత్రీకరిస్తోంది. ఇద్దరు మేజర్ల మధ్య సమ్మతితో సెక్స్ జరుగుతున్నంత కాలం, ఇతర వ్యక్తుల అభిప్రాయాలు అక్కర్లేదు. శృంగారంపై పూర్తి అవగాహన ఉన్న ఇద్దరు వ్యక్తులు బంధంలో ఉన్నా లేకున్నా.. సెక్స్‌లో పాల్గొనాలని నిర్ణయించుకుంటే, వారి స్వేచ్ఛను అడ్డుకునే హక్కు సమాజానికి లేదు.

Also Read : సెక్సువల్ పార్ట్‌నర్స్ మధ్య స్పార్క్ ఎలా పెంచుకోవాలి?

Health tips: పుదీనా తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..?

Advertisement

Next Story

Most Viewed